Navadeep : టాలీవుడ్ హీరో నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జై సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఆ మధ్య కాలంలో చాన్నాళ్లు వార్తల ముఖ్యాంశాల్లో నిలిచాడు. హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో కొద్ది కాలంగా నవదీప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల రవితేజ ఈగల్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు డైలాగ్స్ సాంగ్స్‌కు రీల్స్, చేస్తూ నెట్టింట్లో ఆయన చేసే రచ్చ అంత ఇంత కాదు. అయితే నవదీప్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో నిత్యం ఆయన పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని దాటవేస్తూ వస్తుంటాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా, నవదీప్ తన అభిమానులకు షాకిచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుభలేఖను షేర్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. కానీ అది పెళ్లి కార్డు కాదు.. లవ్ మౌళి రిలీజ్ డేట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. నవదీప్, పంఖురి గిద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ మౌళి ఏప్రిల్ 19న రిలీజ్ కానుందని శుభలేఖ ద్వారా తెలియజేశాడు. అయితే ఇందులో పెళ్లి కొడుకు పేరు దగ్గర నవదీప్ అని ఉండగా.. పెళ్లి కూతురు స్థానంలో పంఖురి గిద్వానీ పేరు ఉంది.
ముహుర్తం స్థానంలో విడుదల తేదీని చూపిస్తూ పెళ్లి శుభలేఖ ఎలా ఉంటుందో అలాగే డిజైన్ చేసి వెరైటీగా లవ్ మౌళి సినిమాపై ఆసక్తిని పెంచాడు. చాలా కాలం తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో నవదీప్ ఇలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నవదీప్ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిజంగా అది నీ పెళ్లి కార్డు అనుకున్నాము భలే ప్లాన్ చేశావ్ బ్రో అంటున్నారు.