Ram Charan : లవ్ మౌళి సినిమా గురించి నవదీప్ మాట్లాడుతూ.. విజన్, అవుట్ పుట్ మాత్రం దర్శకుడిదేనన్నారు. కథ చెప్పినప్పుడు హీరో ఇలా ఉంటాడు అనే ఊహ తనకు లేదన్నారు. తన రోల్ గురించి చెప్తే.. ఆ ప్రయత్నం చేస్తానని డైరెక్టర్ కు చెప్పినట్లు వెల్లడించారు. ఇక రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో నవదీప్ నటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. ధృవ 2 రాబోతుంది. మరి ధృవ 1లో మీరు కనిపించారు. మరి సీక్వెల్ కూడా కనిపిస్తారా అని అడిగారు. దీనికి నవదీప్ నవ్వుతూ.. తాను ఫస్ట్ పార్టులో చనిపోయానంటూ ఫన్నీగా చెప్పుకువచ్చారు. దానికి యాంకర్… అంటే సీక్వెల్ కథ కంటిన్యూ ఉండకపోవచ్చు కదా అని అడిగారు. దానికి నవదీప్ స్పందిస్తూ… దానికి కంటిన్యూషన్ ఉంటుందో లేదో తెలియదన్నారు. తనను అయితే కంటాక్ట్ అవ్వలేదని తెలిపారు.
ఇక ధృవ సినిమాతో మీకు మంచి పేరు వచ్చింది. రామ్ చరణ్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది.. తర్వాత చరణ్ తో నటించే అవకాశం రాలేదా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి నవదీప్ మాట్లాడుతూ.. ‘ఇంకా రాలేదు అండి. నేను దాని కోసం వెయిట్ చేస్తున్నాను. చరణ్ జెమ్ ఆఫ్ ది పర్సన్. చందమామ తర్వాత పరిచయం అయ్యారు. చిరంజీవి దగ్గర అబ్బాయి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి… తను చేసిన కష్టంతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. వారిని దగ్గరి నుంచి చూసినప్పుడు మనకు స్ఫూర్తి కలుగుతుంది. అదంతా చిరంజీవి గారి నుంచి వచ్చిన క్వాలిటీ అది. నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను’ అన్నారు.
ఆపరేషన్ వాలంటైన్ చిత్రంలో కూడా కనిపించారు. ఎక్కువగా చనిపోయే క్యారెక్టర్ చేస్తున్నారు… ఏంటి అని యాంకర్ అడగ్గా… ‘ధృవ తర్వాత వచ్చింది అందుకే చేశాను.. తక్కువ టైంలో ఇంపాక్ట్ కలిపించి.. ఒకసారి ధృవలో వర్కౌట్ అయింది అందుకే ఆపరేషన్ వాలంటైన్ లో పెట్టారేమో’ అని నవదీప్ చెప్పుకువచ్చారు. ఇక రవితేజ గురించి మాట్లాడుతూ.. ఆయనతో వర్క్ చేయడం చాలా సరదాగా ఉండేదన్నారు. ఈగల్ సమయంలో సరదాగా గడిపినట్లు చెప్పారు. ఆయనది నాది సేమ్ బర్త్ డే. నేను బర్త్ డే విషెష్ చెప్పినా.. సేమ్ టు యూ అబ్బాయ్ అని చెప్పేవారు. ఆయనతో టైం స్పెండ్ చాలా సరదాగా అనిపించేదంటూ వెల్లడించారు.