Allu Arjun : మన ఇండియా లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ అవార్డ్స్ ని కాసేపటి క్రితమే ప్రకటించారు. 69 వ జాతీయ ఫిలిం ఫేర్ అవార్డ్స్ పేరు తో పిలవబడిన ఈ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ని అందుకున్నాడు. తెలుగు నుండి హీరోల క్యాటగిరిలో నేషనల్ అవార్డు ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు. చిరంజీవి , మహేష్ బాబు , వెంకటేష్ ఇలా ఎంతో మంది నటీనటులు అద్భుతమైన నటన కనబర్చిన కూడా వారికి నేషనల్ అవార్డు దక్కలేదు.

అలాంటిది అల్లు అర్జున్ కి దక్కడం తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో గర్వపడుతూ అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియచేస్తుంది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన పేరు మారుమోగిపోతుంది. కేవలం అభిమానుల నుండి మాత్రమే ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు వెల్లువ కురుస్తుంది.

ఇకపోతే మిగిలిన విభాగాలలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ తన సత్తా చాటింది. పుష్ప సినిమాకి సంగీతం అందించినందుకు గాను దేవి శ్రీ ప్రసాద్ కి , #RRR చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించినందుకు గాను కీరవాణి కి, #RRR చిత్రం లో అద్భుతమైన పాటలు పాడినందుకు గాను కాలభైరవ కి , స్పెషల్ ఎఫెక్ట్స్ కి కూడా #RRR చిత్రానికే నేషనల్ అవార్డు దక్కింది.

ఇకపోతే #RRR లో రామ్ చరణ్ పరిచయ సన్నివేశానికి అద్భుతమైన ఫైట్ ని డిజైన్ చేసినందుకు గాను సాల్మోన్ కి బెస్ట్ ఫైట్ కంపోజర్ గా నేషనల్ అవార్డు దక్కింది. ఇక కొండపోలం చిత్రం లో అద్భుతమైన పాటలు రాసినందుకు గాను చంద్ర బోస్ కి నేషనల్ అవార్డు దక్కగా, ఉత్తమ సినిమాగా ఉప్పెన చిత్రానికి నేషనల్ అవార్డు దక్కింది.మొత్తం మీద #RRR చిత్రానికి ఆరు జాతీయ అవార్డులు దక్కాయి.