నారీ నారీ నడుమ మురారీల తయారయింది సీనియర్ నటుడు నరేష్ పని. గత కొంతకాలంగా నరేశ్, నటి పవిత్ర లోకేశ్ ల మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుంది. త్వరలో పవిత్రను పెళ్లాడబోతున్నానంటూ నరేశ్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రను నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తానని హెచ్చరించారు. తమకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని, ఆ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని అన్నారు. నరేశ్ కు విడాకులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు.ఈ వ్యవహారం వల్ల తన పదేళ్ల కుమారుడు డిప్రెషన్ కు లోనవుతున్నాడని ఆవేదన వెలిబుచ్చారు.
అయితే తాజాగా నరేష్ ఈ విషయంపై మాట్లాడినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆయన మాట్లాడారు. విడాకుల కోసం భార్యాభర్తలు 6 నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని… భార్యాభర్తలిద్దరూ కోరుకుంటే విడాకులు వెంటనే మంజూరు చేయొచ్చని సుప్రీం స్పష్టం చేసిందని ఆయన చెప్పారు.వివాహ బంధం మెరుగుపరుచుకోవటానికి అవకాశం లేని కేసులలో వెంటనే విడాకులు మంజూరు చేయాలని ధర్మాసనం తీర్పు వెల్లడించిందని గుర్తుచేశారు.సుప్రీం ఇచ్చిన తీర్పుపై తాజాగా సినీ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో తనకు విడాకులు వచ్చేసినట్లేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
తాజాగా నరేష్, పవిత్ర జంట ఓంకార్ షో లో పాల్గొన్నారు. ఈ షోలో వీళ్లు చేసిన హంగామా మామూలుగా లేదు. ఒకరినొకరు హగ్ చేసుకోవడంతో పాటు ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. వయసులో ఉన్న యువతీయువకులకు మించి వీళ్లిద్దరు ఆ షోలో రచ్చ చేశారు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటనే నరేష్ ను ఓంకార్ అడిగారు.
“భూమి బద్దలైనా, ఆకాశం ఊడిపడినా, తామిద్దరం కలిసే ఉంటాం” అంటూ కుండబద్దలు కొట్టారు నరేష్. మీరు ముద్దుగా పవిత్రని ఏమని పిలుస్తారు? అని ఓంకార్ మరో ప్రశ్న అడుగతారు. “అమ్ములు అని పిలుస్తాను. ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అంటాను. ఇంకా ప్రేమ ఎక్కువైతే వద్దులే. చెప్తే బాగోదు” అంటూ నవ్వుతారు. వీళ్లిద్దరు కలిసి ఫుల్ జోష్ గా గేమ్ ఆడారు. వీరిద్దరి యాక్టివ్ నెస్ ముందు కుర్రాళ్లు కూడా పనికి రారు అనే మాదిరిగా షో ఆడుతూ అలరించారు.