సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తోన్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ‘వేసవిలో చల్లటి చిరుగాలి’ క్యాప్షన్‌తో మే 18 ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ యాక్టర్ నరేష్ ప్రసంగాలు ఆడియన్స్‌ను అలరించాయి. ప్రత్యేకించి షూటింగ్ లొకేషన్‌కు తన పార్ట్‌నర్ పవిత్ర లోకేష్ వచ్చిన విషయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు నరేష్.

స్టేజ్ పైన ఉన్న నరేష్కు సుమ మల్లెపూలు కావాలా, మజ్జిగ కావాలా అని అడిగింది. మజ్జిగ ఎందుకు ఉన్న మూడు కూడా పోతుంది. మల్లెపూలు ఇవ్వండి అని చెప్పాడు. పూలు ఇవ్వగానే వాటిని చేతికి చుట్టుకుని వాసన చూస్తూ నాకు వీటిని చూస్తే పవిత్ర గుర్తుకు వస్తుంది అని అన్నారు. ఆమెది మల్లె పూల వంటి మనసంటూ కవర్ చేశారు. తాను విజల్ వేయాలంటే చూట్టు పోలీసులు ఉండాలి. పక్కన పవిత్ర ఉండాలని అన్నారు. దీంతో సుమ కూడా పంచ్ వేసింది. ఆ పూలు ఇంటికి తీసుకు వెళ్లండి పవిత్ర ఎదురుచూస్తుంటుంది అని.

ఈ మూవీ షూటింగ్ ‘విక్టోరియాపురం’లో జరిగింది. అయితే ఈ లొకేషన్ గురించి నరేష్ వివరిస్తూ.. ‘ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్‌లో షూటింగ్స్ పెట్టి, సరదాగా రిలాక్స్ అవండని అప్పుడప్పుడు బ్రేక్‌లు ఇచ్చారు. నాకు అక్కడ ఇల్లు కూడా ఉంది. చక్కగా పవిత్ర కూడా వండుకుని క్యారియర్ తెచ్చేది. ఇదంతా ఫెంటాస్టిక్ టైమ్. కానీ ఒక ప్రొడ్యూసర్ కోణంలో ఆలోచిస్తే మాత్రం భయమేస్తుంది. ఏదేమైనా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా బ్యూటిఫుల్ ఫిల్మ్ తీశారు. అందుకే 16 కూరల కంచం ఈ సినిమా. ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు ఇది గాలి కాదు, చిరుజల్లు’ అన్నారు నరేష్.