Pavithra Naresh: అందుకే పవిత్రని ప్రేమించాను.. ఈ మాత్రానికే నరేష్ పడిపోయాడా

- Advertisement -

Pavithra Naresh: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన జంట సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్. సినిమాల్లో కలిసి నటించిన వీరు బయట కూడా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక నరేష్ తన మూడో భార్యతో గొడవలు, ఇవి రోడ్డుకెక్కడం, పవిత్ర-నరేష్ కలిసి ఓ హోటల్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మూడో భార్య పట్టుకోవడం.. ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. దీంతో నరేష్-పవిత్ర లోకేష్ పై ఎన్ని గాసిప్స్ వచ్చినా పట్టించకోకుండా వారి పని వారు చేసుకుపోతున్నారు.

actress pavitra shocking comments about marriage with naresh

నరేష్ మూడు పెళ్లిళ్లు విడాకులతో ముగిశాయి. ప్రస్తుతం ఆయన పవిత్రలో రిలేషన్ లో ఉన్నాడు. వీరి పెళ్లి అయిందో లేదో తెలీదు. మూడో భార్యతో విడాకులు పూర్తి కాకపోవడంతో పెళ్లి అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ఆ సంగతి అలా ఉంచితే లేటు వయసులో వీరిద్దరూ ఎందుకు ప్రేమలో పడ్డారు అనే విషయం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉంటే అంతా పవిత్ర ఆస్తి కోసమే నరేష్ ని ప్రేమించిందని ప్రచారం జరిగింది. అయితే తనకు పవిత్ర మీద ప్రేమ కలగడానికి రీజన్ ఏంటో నరేష్ రీసెంట్ గా వెల్లడించాడు. తన తల్లి విజయనిర్మల పుట్టినరోజు పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటేనట. ఇద్దరి పుట్టినరోజు ఫిబ్రవరి 20వ తేదీన అని నరేష్ వెల్లడించాడు. ప్రకృతి ఆ విధంగా తనకు సిగ్నల్ పంపిందని పవిత్ర లోకేష్ తో ప్రేమ గురించి ఆయన కామెంట్ చేశాడు. అత్తా కోడళ్ల బర్త్ డేలు కలవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తన జీవితంలో మాత్రం ఈ మిరాకిల్ జరిగిందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

మా అమ్మ నీకు అన్నీ ఇచ్చాను.. కానీ మంచి భాగస్వామిని ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉండేది. కానీ పవిత్ర లోకేష్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె అనారోగ్యంతో చివరి దశలో బెడ్ మీద ఉన్నారు. అప్పుడు నా భాగస్వామి గురించి నువ్వు దిగులు పడొద్దు. నా లైఫ్ లోకి ఒక మంచి వ్యక్తి వచ్చింది ధైర్యంగా ఉండమని మా అమ్మకి చెప్పానంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. పవిత్ర కూడా తన తల్లిలాగే చాలా స్ట్రాంగ్ ఉమెన్.. అని బహుశా అందుకే తనకు నచ్చి ఉండవచ్చేమోనంటూ నరేష్ కామెంట్ చేశారు. నరేష్ జీవితంలో పవిత్ర నాలుగో వ్యక్తి కాగా పవిత్రకు కూడా గతంలోనే వివాహం జరిగింది. తన మొదటి భర్త నుంచి ఆమె దూరంగా ఉంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here