ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేర్లు నరేష్, పవిత్ర లోకేష్. నరేష్ నటి పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు రీసెంట్ డేస్ లో ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను, పెళ్లి వీడియోను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ తన తల్లి విజయనిర్మలను గుర్తు చేసుకొని ఎమోషనల్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి ఎవరికో మంచి చేయడానికి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. అయితే పెళ్లి వల్ల ఎవరికి మంచి జరగలేదు.

తాజాగా మరోసారి పవిత్ర గురించి కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కారు. అయితే ఈ ట్రైలర్ లో వీళ్లిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. 60 ఏళ్ళ వయసులో నరేష్ .. లిప్ లాక్ చేయడం ఏంటి? ఈ వయసులో అతను ప్రజెంట్ జనరేషన్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే కామెంట్స్ వినిపించాయి. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
దీనిపై మాట్లాడారు. 20 ఏళ్ళ వయసు వాళ్ళే లిప్ లాక్ చేసుకోవాలా? 60 ఏళ్ళ వయసుంటే లిప్ లాక్ చేసుకోకూడదా?’ అంటూ మండిపడుతూ ప్రశ్నించారు. ‘అలాగే సెకండ్ ఇన్నింగ్స్ అనేది బాగుండాలి. ఓ మంచి తోడు ఉండాలి.. అని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ప్రేమని ఏ వయసులో ఉన్నవారైనా.. ఎలాగైనా వ్యక్తపరచొచ్చు’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పవిత్రకి మాత్రమే కాదు గతంలో ‘చందమామ కథలు’ సినిమాలో కూడా ఆమనికి నరేష్ లిప్ లాక్ పెట్టారు.