Nani : ప్రస్తుతం నాని ఫ్యాన్స్ ఆయనపై పీకల మీద దాక కోపంలో ఉన్నారు. అసలు మా హీరోకు ఏమైంది ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడుగా .. మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలే చేశాడు.. మరి ఇప్పుడెందుకు ఇలాంటి సబ్జెక్టుని చూస్ చేసుకుంటున్నారు ..? ఇలాంటి వ్యాఖ్యలతో నానిని ఆయన అభిమానులు వేలెత్తి చూపిస్తున్నారు . హీరో నాని తాజాగా ఓ బోల్డ్ కాంట్రవర్షియల్ సినిమాకు ఓకే చెప్పారట. ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత నాని ఓ కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారట.
అది కూడా ఆయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో విడాకుల విషయం అభిమానులకి తెలియజేస్తూ.. దాంట్లో అసలు నిజా నిజాలు ఏంటి అని ప్రజలు తెలుసుకోవడానికే ఇలాంటి కొత్త కాన్సెప్ట్ చూస్ చేసుకున్నారట ఆ కొత్త డైరెక్టర్. నిజానికి ఈ స్టోరీ మామూలుగా అయితే నాని ఒప్పుకునేవాడు కాదు. కానీ ఈ స్టోరీలో చాలా తెలుసుకోవాల్సిన విషయం ఉందట. దీనిని అభిమానులే కాకుండా పెళ్లి చేసుకునే కొత్త జంటలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందట.
ఆ కారణంగానే ఆయన ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారట. అయితే అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. ఎందుకు నాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటూ ఫైర్ అవుతున్నారు. నిజానికి నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ నార్మల్ కాన్సెప్ట్ నే.. ఫట్ టైం ఇలాంటి కాంట్రవర్షియల్ జోనర్ టచ్ చేస్తున్నాడు నాని.. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?