Nandamuri Mokshagna మొదటి సినిమా రిలీజ్ తేదీ ఫిక్స్.. ఫ్యాన్స్ కి ఇక పండగే!

- Advertisement -

Nandamuri Mokshagna : నందమూరి కుటుంబం తో పాటుగా ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా. సుమారుగా దశాబ్దం కాలం నుండి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బాలయ్య బాబు మోక్షజ్ఞ జాతకం రీత్యా, 30 ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఆయన భవిష్యత్తు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుందని జ్యోతిష్యులు చెప్పడంతో మోక్షజ్ఞ డెబ్యూ కోసం అభిమానులు ఇంతలా నిరీక్షించాల్సి వచ్చింది. అయితే రెండేళ్ల క్రితం మోక్షజ్ఞ లుక్స్ చూసి అభిమానులు సైతం భయపడ్డారు. హీరో అయ్యేందుకు ఏ మాత్రం అర్హతలేని విధంగా తయారు అయ్యాడేంటి, అసలు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా అని అనుమాన పడ్డారు.

Nandamuri Mokshagna
Nandamuri Mokshagna

అయితే బాలయ్య బాబు కచ్చితంగా మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడని, నందమూరి కుటుంబం బరువు బాధ్యతలు మోయాల్సింది ఆయనే కదా అంటూ అభిమానులకు చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కచ్చితంగా ఉంటుంది అని ఖరారు చేసాడు. మొదటి సినిమా డైరెక్టర్ ఎవరు అనే దానిపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు కానీ, రీసెంట్ గా ఆయన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన లేటెస్ట్ లుక్స్ మాత్రం సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. రెండేళ్ల క్రితం మేము చూసిన మోక్షజ్ఞ ఇతనేనా అనే రేంజ్ లో ఆయన మారిపోయాడు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆగస్టు నెల నుండే మొదటి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట.

THIS star director to helm Nandamuri Mokshagna's debut film? | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

- Advertisement -

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియచేయనున్నాడు. బాలయ్య బాబు కి బాగా కలిసి వచ్చే సంక్రాంతి కి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. ఇప్పటికే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం విడుదల కాబోతుంది, ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబొయ్యే సినిమా కూడా విడుదల కానుంది. అలాగే ప్రభాస్ రాజా సాబ్ చిత్రం కూడా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ముగ్గురు స్టార్ హీరోల సినిమాల మధ్యలో బాలయ్య బాబు కొడుకు మొదటి సినిమా విడుదల కాబోతుంది అన్నమాట. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల ని ఖరారు చేసినట్టు సమాచారం.

Mokshagna's social media post brings excitement on his debut

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here