Nandamuri Mokshagna : అనిల్ రావిపూడిలాంటి కామెడి డైరెక్టర్.. బాలకృష్ణతో కలిసి ‘భగవంత్ కేసరి’లాంటి యాక్షన్ సినిమాను ఎలా తెరకెక్కించగలరు అని సందేహిస్తున్న ప్రేక్షకులకు ట్రైలర్‌తో గట్టి సమాధానమే ఇచ్చాడు దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా జరిగింది.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మూవీ టీమ్ అంతా హాజరయ్యింది. ఇక ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ ఉపయోగించిన ఒక పదం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘భగవంత్ కేసరి’ చిత్రంలో శ్రీలీల.. బాలయ్యకు కూతురి పాత్ర చేసింది. అయితే ఆ మూవీ షూటింగ్ జరిగినంత వరకు శ్రీలీల తనను చీచా అని పిలిచిందని గుర్తుచేసుకున్నారు. అయితే తరువాతి సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించాలని ఉందని బయటపెట్టారు.

ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి తన వాళ్లతో పంచుకున్నానని, అప్పుడు తన కొడుకు మోక్షజ్ఞ కోపడ్డాడని, త్వరలోనే శ్రీలీలతో తను హీరోగా లాంచ్ అవుతుండగా.. బాలయ్య ఇలా అనడంతో సీరియస్ అయ్యాడని అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ తన కొడుకు తిట్టాడని బాలయ్య బయటపెట్టారు. అయితే స్టేజ్‌పైనే బాలయ్య ఈ మాట మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచినా.. బాలయ్య మనస్థత్వం తెలిసినవారు మాత్రం లైట్ తీసుకున్నారు.