సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ తన కుటుంబం తో సమయం కేటాయించడం లో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వెయ్యడు. సంవత్సరానికి 50 రోజులు సినిమా షూటింగ్ లో ఉంటే, మిగిలిన రోజులు మొత్తం ఫ్యామిలీ తో కలిసి విదేశీ టూర్స్ వేస్తూ ఉంటాడు. ఒక పక్క కష్టపడుతూనే మరోపక్క కుటుంబం తో కలిసి లగ్జరీ జీవితం ని అనుభవిస్తూ ఉంటాడు. బ్రతికితే ఇలాంటి బ్రతుకు బ్రతకాలి అని ప్రతీ ఒక్కరికి అనిపించేలా చేస్తాడు మన మహేష్ బాబు.

అంతే కాదు తాను సంపాదించిన డబ్బులతో కొంతభాగం చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్స్ చెయ్యడానికి వినియోగించే గొప్ప మనసు ఉన్న వ్యక్తి మహేష్ బాబు కి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు మహేష్ కి సిగరెట్స్ తాగే అలవాటు ఉండేది. ఆ తర్వాత ఒక పుస్తకం చదవడం వల్ల ఆ అలవాటు ని మానుకున్నాను అని ఒక ఇంటర్వ్యూ లో చెప్తాడు.

ఇది కాకుండా మహేష్ బాబు కి మరో చెడు అలవాటు ఉందని, అది ఇప్పటికీ మానలేదు అంటూ నమ్రత రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. తన పిల్లలు ఇంట్లో ఉన్న సమయం లో మహేష్ బాబు వారితో కలిసి వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడట. అలా ఆడుతూ రోజు మొత్తం గడిపేయడం వల్ల ఎన్నో ముఖ్యమైన పనులను పక్కన పెట్టేస్తుంటాడు, మహేష్ కి వీడియో గేమ్స్ అంటే అంత పిచ్చి అంటూ నమ్రత శిరోద్కర్ ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఇకపోతే మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం జనవరి 12 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అటు ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది.
