Namratha : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యూత్ , ఫ్యామిలీస్ మరియు లేడీస్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదు. సరికొత్త కథాంశాలతో సినిమాలు తియ్యడమే కాకుండా, తన ప్రతీ సినిమాతోనూ సమాజానికి ఎదో ఒక కొత్త విషయం చెప్పాలని, సందేశం ఇవ్వాలని చూస్తూ ఉంటాడు ఆయన.

అందుకే మహేష్ సినిమాలు రికార్డ్స్ ని అవలీలగా బ్రేక్ చేస్తూ ఉంటాయి. ఒక స్టార్ గా ఆయన ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడో, మనిషిగా కూడా అంతే ఉన్నతంగా ఉంటాడు. జెంటిల్ మెన్ గా, ఫ్యామిలీ పర్సన్ గా మంచి పేరు తెచ్చుకున్న మహేష్ బాబు, వేలాది మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేసి దేవుడు అనిపించుకున్నాడు. అలాగే ఎంత పెద్ద సూపర్ స్టార్ అయ్యినప్పటికీ కూడా , తన కుటుంబానికి కావాల్సినంత సమయం ఇవ్వడం మహేష్ బాబు లో ఉన్న మరో గొప్ప లక్షణం.

రీసెంట్ గా ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు గురించి చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘మహేష్ కి ఆడవాళ్ళ కళ్ళు పెద్దవి గా ఉంటే అసలు నచ్చదు’ అంటూ కామెంట్ చేసింది. పెద్ద కళ్ళు ఉన్నవారిని ఆయన సరదాగా దెయ్యం అని పిలుస్తాడట. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. వచ్చే నెల 12 వ తారీఖున సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ఎలా అయినా విడుదల చెయ్యాలని అనుకుంటున్నాడు మహేష్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మరియు లిరికల్ వీడియో సాంగ్స్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.