Namrata Shirodkar : స్టార్ హీరోల సతీమణులలో సోషల్ మీడియా నిత్యం యాక్టీవ్ గా ఉండే వారిలో ఒకరు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్. తన జీవితం లో జరిగే అతి ముఖ్యమైన విషయాలను సంఘటనలను ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఒకపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, మరోపక్క మహేష్ బాబు వ్యాపారాలను డీల్ చేసుకుంటూ భార్య అంటే ఇలా ఉండాలి అని అంపించేలా చేసింది.

అందుకే మహేష్ ఫ్యాన్స్ నమ్రత శిరోద్కర్ ని మహేష్ బాబు ని ఎంతలా అభిమానిస్తారో, అంతలా అభిమానిస్తుంటారు. అంతే కాదు తన కొడుకు కూతుర్లకు అందరికీ ఎంత గౌరవం ఇవ్వాలో కూడా ఈమె నేర్పించింది. పిల్లలిద్దరికీ తాము ఒక సూపర్ స్టార్ కి బిడ్డలం అనే గర్వం ఇసుమంత కూడా కనిపించదు. ఇంత చక్కని సంస్కారం ఎంత మందికి ఉంటుంది చెప్పండి. రీసెంట్ గా నమ్రత శిరోడ్కర్ తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తమ ఇంటి పని మనిషి శాలిని కొండ్ర తో నమ్రత మరియు ఆమె పిల్లలు కలిసి దిగిన ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ ‘మా కుటుంబం లో మా అమ్మా నాన్న తర్వాత నేను సొంత మనిషి గా ఫీల్ అయ్యింది శాలిని కొండ్ర గారిని మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మ నాన్న తర్వాత ఈమె అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. మా ఇంట్లో ఒక సొంత మనిషి లాగ కలిసిపోయి, ఎన్నో తరాల నుండి సేవలు అందిస్తూ వచ్చింది.

ఆమె మాతో కలిసి ఉండడాన్ని మేము అదృష్టం గా భావిస్తున్నాం’ అంటూ ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పని మనుషుల మీద ఆధిపత్యం చూపిస్తూ వస్తున్న ఈ రోజుల్లో అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా పని మనిషికి నమ్రత ఇస్తున్న గౌరవం చూసి నెటిజెన్స్ సెల్యూట్ చేస్తున్నారు.