Namrata : సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. గతంలో బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. అంజి, వంశీ వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కొట్టలేదు. కానీ ప్రపంచ సుందరి కిరీటంతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్‌తో ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ నమ్రత ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సి ఉండే.. కానీ ఛాన్స్ మిస్ అయింది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/07/mahesh-babu-pens-down-a-heartfelt-note-to-wish-his-better-half-namrata-shirodkar-on-her-birthday-001-jpg.webp)
అందుకు కారణం ఆమె మామ కృష్ణ అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. మహేష్ బాబు, భూమిక కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రూ.కోటి బడ్జెట్‌తో రూపొందింది. రూ.14 కోట్లతో తెరకెక్కిన సినిమా రూ.30 కోట్లు రాబట్టింది. మహేష్ బాబు వన్ ఆఫ్ ది హిట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయితే ఈ సినిమా చేసే సమయాకి మహేష్, నమ్రత ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారట.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/download-1-3.jpg)
ఈ కారణంగానే ఈ సినిమాలో నమ్రతను హీరోయిన్ గా పెట్టమని మహేష్ సూచించాడట. దానికి దర్శకుడు గుణశేఖర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ విషయం కృష్ణకు తెలిసి నమ్రత అవసరం లేదంటూ తిరస్కరించాడు. ఎందుకంటే మహేష్, నమ్రత ఇప్పటికే ప్రేమలో ఉన్నారని అతనికి కూడా తెలుసు. ఈ సినిమాలో మళ్లీ కలిస్తే ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో కృష్ణ ఈ సినిమాలో నమ్రత వద్దు అని చెబుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ న్యూస్ ట్రెండ్ వైరల్ అవుతుంది.