Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో శివాజీ తనదైన మార్క్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది ఆయన్ని చాణక్య అని పిలుస్తారు, మరికొంత మంది ఆయన్ని సోఫాజీ అని పిలుస్తారు, మరి కొంతమంది బిజ్జల దేవా, నక్కాజీ ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. సోషల్ మీడియా లో ఆయన గురించి తరచూ వినపడే పదాలు ఇవే. శివాజీ ని బయటపెట్టే ధైర్యం హౌస్ లో ఒక్క గౌతమ్ తప్ప ఎవ్వరూ చెయ్యడం లేదు.

కానీ గౌతమ్ శివాజీ తనకి కావాలని అన్యాయం చేస్తున్నాడు అనే అపోహతో శివాజీ ని టార్గెట్ చేస్తూ చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు. నిజానికి శివాజీ గౌతమ్ ని ఎప్పుడు టార్గెట్ చేసింది లేదు, అతని గురించి వెనుక చేరి మాట్లాడింది లేదు. కానీ అమర్ దీప్ మీద మాత్రం అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

13 వ వారం లోకి వచ్చినా కూడా అమర్ దీప్ ని ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. కానీ అమర్ దీప్ మాత్రం అవేమి పట్టించుకోకుండా ముందుకు పోతున్నాడు. కానీ గౌతమ్ మాత్రం అవసరం లేకపోయినా శివాజీ ని టార్గెట్ చెయ్యడం ఆయన ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు. ఇకపోతే ఈరోజు జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో ప్రతీ ఒక్క కంటెస్టెంట్ కి సంబంధించి కొన్ని క్యాప్షన్స్ తో కూడిన బుక్స్ ని ఇచ్చి డెడికేట్ చెయ్యమంటాడు.

అప్పుడు గౌతమ్ శివాజీ కి సంబంధించి ‘కుళ్ళు కుతంత్రాలు తగ్గించడం ఎలా’ అనే క్యాప్షన్ ఉన్న బుక్ ని ఇస్తాడు. చాలా సేపు వాళ్ళిద్దరి మధ్య వాదనలు జరుగుతాయి. కేవలం ఇద్దరికే సపోర్టుగా ఉంటున్నాడు, ఒక్కసారి కూడా వాళ్ళని నామినేట్ చెయ్యలేదు అని అనగా, అప్పుడు నాగార్జున మీ చెల్లి ప్రియాంక అమర్ మరియు శోభా ని ఎప్పుడైనా నామినేట్ చేసిందా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఎపిసోడ్ లో చూడాలి.
