Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన నిహారిక కొణిదెల పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా ఎలాగో సక్సెస్ కాలేకపోయింది, కనీసం నిర్మాతగా అయిన రాణిద్దాం అనుకుంది కానీ, నిర్మాతగా కూడా అన్నీ అపజయాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఈమె చైతన్య అనే వ్యక్తిని పెళ్లాడింది. వీళ్లిద్దరి పెళ్లిని నాగబాబు ఎంత ఘనంగా జరిపాడో మనమంతా చూసాము.

కానీ కొన్ని అనుకొని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. దీంతో నిహారిక మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ముందుగా ఒక వెబ్ సిరీస్ చేసింది. పెద్దగా సక్సెస్ కాలేదు, ఇప్పుడు వెండితెర మీద హీరోయిన్ గా త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అనేక విషయాలను పంచుకుంది. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

అయితే ఈమె చిన్నతనం లో ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సిసింద్రీ చిత్రం లో అఖిల్ కి బదులుగా ముందు ఈమెనే ఎంచుకున్నారట. నిహారిక 1993 వ సంవత్సరం లో పుట్టింది. ఆ సమయం లో సిసింద్రీ మూవీ టీం ఒక చిన్న పాప లేదా బాబు కోసం వెతుకుతున్నారట. నిహారిక కాండీల వాళ్లకు ఎంతో నచ్చింది. కానీ నిహారిక చిన్నతనం నుండే చాలా యాక్టీవ్ గా ఉండేదట. పుట్టిన 8 నెలలకే ఆమె పైకి లేచి నడవడం ప్రారంభించింది అట.

దీనిని గమనించిన మూవీ టీం ఒక్కసారిగా షాక్ కి గురైంది అట. ఎందుకంటే తమ సినిమాలో బేబీ దోగాడుతూనే వెళ్ళాలి, కానీ నిహారిక లేచి నడవడం చెయ్యడం తో ఆమెని తీసుకోలేదట. ఆ తర్వాత నాగార్జున తన కొడుకునే తీసుకోమని అఖిల్ ని ఇచ్చి ఆ సినిమాని చేయించాడట. ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
