Bigg Boss : బిగ్ బాస్ ప్లాన్ మొత్తం మార్చేయనున్న నాగార్జున.. ఇకపై ఎలిమినేషన్ లో అది కీలకం కానుందా..

- Advertisement -

Bigg Boss : ఆదివారం ఎపిసోడ్ లో అంతా ఈ ఎవిక్షన్ పాస్ గురించే మాట్లాడారు. నాగార్జున ఎంట్రీ తర్వాత ప్రతి వారం సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ గా ఉండేది కానీ ఇకపై అలా ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరికి యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్‌మేట్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లో ఎవర్ని కొత్తగా ఫ్రెండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎవర్ని బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ ట్యాగ్స్ ఇవ్వాలని చెప్పాడు నాగ్. ఈ టాస్క్ లో గౌతమ్.. ప్రశాంత్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, శోభాశెట్టికి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు.

Bigg Boss
Bigg Boss

అమర్ దీప్ కూడా ప్రశాంత్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, రతికకు బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. రతిక.. శోభాశెట్టికి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, అమర్ దీప్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చింది. శోభాశెట్టి.. రతికకు ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, గౌతమ్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చింది. అశ్విని.. శోభాశెట్టికి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, గౌతమ్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చింది. యావర్.. శోభాశెట్టికి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, గౌతమ్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. ప్రశాంత్.. అమర్ దీప్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, రతికకు బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. అర్జున్.. శివాజీకు ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, యావర్ కి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు. శివాజీ.. అర్జున్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, రతికకు బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చాడు.

Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7

చివరగా ప్రియాంక.. ప్రశాంత్ కి ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వగా, అశ్వినికి బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చింది. అయితే ఇన్నాళ్లు హౌస్ లో గొడవపడిన వాళ్ళు ఫ్రెండ్స్ ట్యాగ్ ఇచ్చుకోవడం, క్లోజ్ గా ఉన్న వాళ్ళు బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్ ఇచ్చుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరి రేపు నామినేషన్స్ లో ఇలాగే ఉంటారా మళ్ళీ అంతకుముందు లాగే గొడవలు పడతారా చూడాలి ఈ కొత్త ఫ్రెండ్స్. మొత్తం మీద ప్రశాంత్, శోభాశెట్టిలకు ఎక్కువ ఫ్రెండ్ ట్యాగ్స్ వచ్చాయి. గౌతమ్, రతికలకు ఎక్కువ బ్లాక్ ఏ హౌస్‌మేట్ ట్యాగ్స్ వచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here