Nagarjuna : ఆ విషయంలో చిరు, వెంకీ, బాలయ్యలకు కాకుండా నాగార్జునకు మాత్రమే దక్కిన అదృష్టం

- Advertisement -

Nagarjuna : సినిమా ఇండస్ట్రీకి రావాలని చాలామంది కలలు కంటారు. అలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు స్టార్లుగా మారాలని ఎంతో కష్టపడుతుంటారు. అలా స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత నచ్చిన పాత్ర, నచ్చిన బ్యానర్లో చేయాలని అనుకుంటారు. అలాంటి స్టార్ హీరోలు కొన్ని ప్రతిష్టాత్మక బ్యానర్లలో నటించిన ఒక్క సినిమా అయినా తన కెరీర్లో ఉండాలని కోరుకుంటారు. ఆయా సంస్థల అధినేతలు కూడా ఆ దిశగానే ప్రణాళికలు రచిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావనకు ఓ కారణముంది. రెండో తరం సీనియర్ స్టార్లు మనకు నలుగురు ఉన్నారు. కాగా ఇటీవల కన్నుమూసిన ఈనాడు అధినేత రామోజీరావు తన ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో గొప్ప అణిముత్యాల్లాంటి సినిమాలను అందించారు. ఇప్పటికీ సినీ ప్రియులందరూ వాటిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యమైన విశేషం ఏంటంటే రామోజీరావు ఏనాడూ పెద్ద హీరోలతో.. పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీయాలని ప్రయత్నించలేదు. క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యమనే సిద్ధాంతం ఆయనది.

అందుకే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో ఉషాకిరణ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఒక్క ఛాన్స్ మాత్రం అక్కినేని నాగార్జునకు మాత్రమే దక్కింది. 2001 సంవత్సరం సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో ఆకాశవీధిలో అనే సినిమా వచ్చింది. రామోజీ ఫిలిం సిటీ స్థాపించిన తొలినాళ్లలో అందులో ఉన్న అద్భుతాలను కళ్లకు కట్టినట్టు చూపించి వాడుకునే క్రమంలో పలువురు దర్శక రచయితలు ఆ దిశగానే కథలు రాసుకునే వారు. హనుమాన్ హీరో తేజ సజ్జ బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. నాగార్జున సరసన రవీనాటాండన్ నటించింది. ఇప్పటి ఆస్కార్ విజేత సుస్వరాల వాణి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండేవి.

- Advertisement -


దురదృష్టం ఏంటంటే ఆకాశవీధిలో దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినా ఓవర్ సెంటిమెంట్ జనాలకు నచ్చలేదు. అయినా నాగార్జునకు ఈ బ్యానర్ తో ఒక జ్ఞాపకం ఇప్పటికి అలా మిగిలిపోయింది. టైర్ 2 స్టార్లలో ఉషాకిరణ్ సంస్థ తీసిన వాటిలో రాజశేఖర్ నటించిన మెకానిక్ మావయ్య, జగపతిబాబు నటించిన మూడుముక్కలాట, రవితేజ నటించిన ఒక రాజు ఒక రాణి సినిమాలు ఉన్నాయి. కానీ విచిత్రంగా ఇవన్నీ ఫ్లాప్ అయినవే. అక్కినేని నాగేశ్వరరావుతో డాడీ డాడీ యావరేజ్ గా నడిచింది. కొత్త వాళ్లు చిన్న హీరోలతో తీసిన సినిమాలే ఉషాకిరణ్ బ్యానర్ లో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here