Nagarjuna ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న పోటీ కి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక హీరో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న నటుడు న్యాచురల్ స్టార్ నాని. మీడియం రేంజ్ హీరోలలో యూత్, ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్ లో సరిసమానమైన క్రేజ్ ఉన్న నటుడు ఈయన. ఈమధ్యనే ఈయన దసరా చిత్రం తో వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరాడు. ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు.
#RRR మేకర్స్ డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. మార్కెట్ లో ఈ చిత్రం కి మంచి క్రేజ్ ఉంది. డిజిటల్ రైట్స్ కూడా 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందంటే నాని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే గతం లో నాని అక్కినేని నాగార్జున తో కలిసి ‘దేవదాసు’ అనే చిత్రం చేసాడు. కమర్షియల్ గా పర్వాలేదు అనిపించిన ఈ సినిమా నాని లోని మరో యాంగిల్ ని బయటపెట్టింది.
ఇదంతా పక్కన పెడితే నాని తో పనిచేసిన అనుభూతి గురించి అక్కినేని నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ అందరికీ ఎదో ఒక చెడ్డ అలవాటు ఉంటుంది, అది సహజమే. నాని కి కూడా అలాంటి భయంకరమైన చెడ్డ అలవాటు ఉంది. అదే ఫోన్ కి వ్యసనపరుడు అవ్వడం. షూటింగ్ స్పాట్ లో ఉన్నంతసేపు ఆయన మనుషులతో మాట్లాడడు, ఎప్పుడూ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. నాకు ఈ విషయం లో నాని ని చూస్తే పిచ్చి కోపం వచ్చేది. అతని స్థానం లో అఖిల్, చైతన్య ఉంటే వాళ్ళ చేతిలో నుండి ఫోన్ లాగి కిందపడేసి చెంప పగలగొట్టేవాడిని’ అంటూ నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.