Nagarjuna : సినీ పరిశ్రమలో మన్మథుడు నాగార్జునకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వయసు 60దాటిన ఇప్పటికీ యువతులు తమ కలల రాకుమారుడు నాగార్జునలా ఉండాలని కోరుకుంటారు. ఆయన వైవిధ్యమైన కథనాలను ఎంచుకుంటూ తీసిన సినిమాలు ఒకానొక టైం లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ సాధించాయి. ఆ సినిమాలు ఆయనను కెరీర్లో టాప్ రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వ్యక్తిగతంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆయన సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ కి గురవుతూ వచ్చారు. అయితే నాగార్జునకు చిన్నప్పటి నుంచి క్రమ శిక్షణ పెద్దగా ఉండేది కాదట. ఈ క్రమంలోనే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అతగాడికి క్రమ శిక్షణ నేర్పించేందుకు చాలా చాలా ట్రై చేశారట.

ఎవరైనా దర్శకులు వచ్చి ఆయనకు కథ చెబుతున్నప్పుడు తొంగి తొంగి చూడడం.. మిస్ బిహేవ్ చేయడం.. అరుపులు తో వాళ్లు కథ చెబుతుండగా డిస్టర్బ్ చేయడం లాంటివి చేస్తుండేవాడు. అయితే ఓ రోజు మాత్రం నాగార్జున పూర్తిగా హద్దులు మీరి పోయారట. ఈ క్రమంలోనే నాగేశ్వరరావు ఆయన రూమ్ లో చావగొట్టారట. దీంతో ఇంట్లో నుంచి పారిపోవడానికి ట్రై చేశాడట నాగార్జున. గోడదూకి సగం దూరం కూడా పరిగెత్తాడట. వెంటనే అక్కడ తెలిసిన వాళ్లు వచ్చి మళ్లీ పట్టుకొచ్చి నాగేశ్వర రావుకు అప్పగించారట. ఈ క్రమంలోనే చేసిన తప్పుకు పనిష్మెంట్ గా ప్యాంటు లేకుండా నాగార్జునను అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండు రోజులపాటు తిప్పించాడట నాగేశ్వరరావు. లైఫ్ అంటే ఎలా ఉంటుందో కూడా చూపించాలనుకున్నాడట. ఆ తర్వాతే నాగార్జున లైఫ్ పై సీరియస్గా ఫోకస్ చేసి లైఫ్ లో సెటిల్ అయ్యాడంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.
