బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం

- Advertisement -


తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 కు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 3 ఆదివారం రాత్రి నుంచి బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. ఈ సీజన్లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉండనున్నారు. 106 రోజుల పాటు ఈ సీజన్ కొనసాగే వీలుంది. గత సీజన్లకు హోస్ట్ చేసిన మన్మథుడు నాగార్జునే ఈసారి పగ్గాలు చేపట్టనున్నారు. గత మూడు సీజన్లు కలుపుకొని ఈ సీజన్ తో కలుపుకుని ఇప్పటి వరకు నాగ్ ఐదు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చేశారు అప్పుడు అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

నాగార్జున
నాగార్జున

తర్వాత రెండో సీజన్ కి నాని హోస్టింగ్ చేశాడు. తర్వాత వరుస షోలకు నాగే హోస్టింగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 7కి సంబంధించిన రెండు ప్రోమోలతో నాగ్ సందడి చేస్తున్నారు. ఈ షో గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ సీజన్ కు నాగార్జున దాదాపు రూ.200కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏంటి పొరపాటున ఓ సున్నా ఎక్కువేశారా అని ఆలోచిస్తున్నారా.. తెలుగులో ఇప్పటివరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హోస్ట్ పేరు నాగార్జున మీదే ఉంది. సీజన్ 3కి దాదాపు రూ. 5 కోట్లు తీసుకున్నారని ఆ సమయంలో అదే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అని వార్తలు వినిపించాయి.

Nagarjuna

షో జరిగే 15 వారాలకు గాను నాగ్ షోలో కనిపించేది వారంలో రెండు రోజులే.. శని, ఆదివారాలు షోకి వచ్చి నాలుగు ముక్కలు చెపుతాడు. అప్పుడేదో కాసేపు అలా చెప్పి పోయినందుకు నాగార్జున ఒక్క ఎపిసోడ్ కి కొన్ని కోట్లు చార్జ్ చేస్తాడని టాక్ ఉంది. ఆ లెక్కన చూస్తే మొత్తం 15 వారాలు, ఇతర ప్రోమోలు, స్పెషల్ ఎపిసోడ్స్, ప్రమోషనల్ కార్యక్రమాలు అన్నీ కలిపి మొత్తం సీజన్3కి రూ.5 కోట్లు తీసుకున్నాడు. సీజన్1కి హోస్ట్ చేసిన ఎన్టీఆర్ కు రెమ్యునరేషన్ కింద రూ.2.50 కోట్లు ఇచ్చినట్లు టాక్. ఈ సీజన్ 70 రోజులే కావడంతో ఎన్టీఆర్‌కి తక్కువ ముట్టింది.

- Advertisement -

ఆ తర్వాత 2 సీజన్‌కి నాని మొత్తం 106 రోజులు హోస్టింగ్ చేయగా ఆయనకి ముట్టింది రూ3. కోట్లు. ఇక బీబీ సీజన్ 4 కి వచ్చేసరికి నాగార్జున రూ.8కోట్ల నుంచి10 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు బిబీ సీజన్ 7కు ఏకంగా రూ.200 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అంటూ పుకార్లు వస్తున్నాయి. నిజానికి సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో నాగార్జున పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అందువల్ల ఈ సీజన్ కు రూ. 20 కోట్లే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఏకంగా రెండు వందల కోట్లు అంటూ ప్రచారం నడుస్తుంది. చూడాలి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా లెక్కలు బయటకు వస్తాయేమో.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here