Naga Babu : సొంత కూతురితో వడ్డీ వ్యాపారం చేస్తున్న నాగబాబు.. ఇదెక్కడి దారుణం అండీ బాబోయ్!

- Advertisement -

Naga Babu : మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల అందరికీ సుపరిచితమే. సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఆమె, పెద్దగా సక్సెస్ కాకపోవడం తో వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వచ్చింది. ఇక చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకి పూర్తి గా టాటా చెప్పిన నిహారిక, ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను నిర్మించడం మొదలు పెట్టింది. కానీ ఈమె దురదృష్టం ఒక్కటి కూడా సక్సెస్ ని సాధించలేకపోయాయి.

Naga Babu
Naga Babu

మెగా ఫ్యాన్స్ నుండి కూడా కావాల్సినంత సపోర్ట్ దక్కలేదు. దీంతో నిహారిక ఇప్పటికీ సరైన సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తన భర్త చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మళ్లీ నటన వైపు మొగ్గు చూపుతుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె తండ్రి నాగబాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నిహారిక గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Naga Babu Niharika Konidela

ఆయన మాట్లాడుతూ ‘నా కూతురు నిహారిక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి పలు వెబ్ సిరీస్ లు మరియు సినిమాలను నిర్మిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె దగ్గర డబ్బులు ఉండవు, వెంటనే నన్ను ఫోన్ చేసి అడుగుతుంది. అడిగిన మరుక్షణమే నేను పంపిస్తాను, కానీ ఉచితంగా మాత్రం కాదు, వడ్డీకే ఇస్తుంటాను. ఒక్కోసారి డబ్బులు ఇస్తుంది. ఒక్కోసారి ఆలస్యం అవుతూ ఉంటుంది. కలిసినప్పుడల్లా నాన్న నేను మీకు ఇంత డబ్బులు ఇవ్వాలి కదా అని గుర్తు చేస్తూ ఉంటుంది. అలా ఊరికే గుర్తు చేస్తూ ఉండేలోపు నాకు విరక్తి కలిగి ఇచ్చిన డబ్బులు అడగడం మానేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.

- Advertisement -
Niharika Konidela

అయితే ఇది విన్న తర్వాత తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం కూతురు , కొడుకుకే ఇస్తారు అంటారు. కానీ కూతురుకి ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడం ఏమిటి?, అది కూడా వడ్డీకి తిప్పుతూ, ఏంటో ఈ సినిమా వాళ్ళు, వీళ్ళ పద్ధతులు, ఆచారాలు ఎవరికీ అర్థం కావు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here