Naga Shaurya : కుర్ర హీరోలలో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసే హీరోలలో ఒకడు నాగ శౌర్య.’చందమామ కథలు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైనా నాగ శౌర్య ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమా తో సూపర్ హిట్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.ఆ తర్వాత ఈయన కెరీర్ లో ‘ఛలో’ అనే చిత్రం పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యింది.

మిగిలిన సినిమాలు పెద్దగా ఆడలేదు,అయ్యినప్పటికీ కూడా నాగ శౌర్య కి యూత్ మరియు లేడీస్ లో మంచి క్రేజ్ ఉంది.ఈమధ్యనే పెళ్లి చేసుకున్న ఈ యువ హీరో చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.అవి ఎప్పుడు విడుదల అవుతాయో తెలీదు కానీ రీసెంట్ గా ఈయన హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రేమ జంటతో వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రేమికుల మధ్య వాళ్ళ ప్రమేయం లేకుండా ఎవ్వరూ దూరకూడదు అని పెద్దలు చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేసింది నేడు నాగ శౌర్య విషయం లో. ప్రేమికులు అన్న తర్వాత గొడవలు సహజం, తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు వంటివి జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈరోజు ఒక ప్రేమ జంట చేసుకోవడం గమనించాడు నాగ శౌర్య. ఒక అబ్బాయి అమ్మాయిపైన చెయ్యి చేసుకోవడాన్ని చూసిన నాగశౌర్య వెంటనే కారు దిగి వాళ్ళ వద్దకు వచ్చి ‘ఆ అమ్మాయిని మీడ చెయ్యి ఎందుకు చేసుకున్నావు’ అని అడుగుతాడు. అప్పుడు అతను ‘నా లవర్, నా ఇష్టం నీకు ఎందుకు అన్నా’ అంటాడు.

అప్పుడు నాగ శౌర్య కి కోపం వచ్చి ‘మర్యాదగా ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పు’ అంటూ గొడవకి దిగుతాడు. అలా వాళ్లిద్దరూ గొడవపడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. లవర్స్ మధ్య ఎన్నో ఉంటాయి నీకెందుకు భయ్యా అని కొందరు, ఈ పబ్లిసిటీ స్తంట్స్ ఎన్ని చూడలేదు అంటూ మరికొందరు.. అమ్మాయిల పట్ల నాగ శౌర్య చూపిస్తున్న తీరుకి సెల్యూట్ అంటూ నెటిజెన్స్ బిన్నాభిప్రాయాలతో కామెంట్ చేస్తున్నారు.