సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపూర్ గా మంచి పేరు తెచ్చుకున్న జంట సమంత మరియు నాగ చైతన్య. వీళ్లిద్దరు ఆన్ స్క్రీన్ మీద ఎంత క్యూట్ గా ఉంటారో, ఆఫ్ స్క్రీన్ మీద కూడా అంతే క్యూట్ గా ఉండేవారు. వీళ్లిద్దరు విడిపోయిన తర్వాత లక్షలాది మంది అభిమానులు ఎంతో బాధపడ్డారు. సమంత మరియు నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా బాధపడ్డారు.
మళ్ళీ వీళ్లిద్దరు కలిస్తే చూడాలని ఇప్పటికీ కోరుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు విడిపోయి దాదాపుగా రెండేళ్లు అవుతుంది , ఈ రెండేళ్లలో వీళ్ళ గురించి సోషల్ మీడియా లో వచ్చినన్ని వార్తలు ఏ రాజకీయ నాయకుడి పైన కానీ, సినిమా సెలబ్రిటీ పైన కానీ రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ జంట కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అనేది.
ఇది ఇలా ఉండగా సమంత నాగ చైతన్య తో కలిసి ఉన్న రోజుల్లో ఆమె ఆయన గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి సర్క్యూలేట్ అవుతూ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ ‘నాగ చైతన్య పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంటాడు, అది కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సాయంత్రం ఆరు దాటిందంటే ఇంట్లో సినిమాల గురించి మాట్లాడకూడదు, పెళ్ళికి ముందు చైతన్య అలా ఉండేవాడు కాదు, ప్రతీ విషయం లో చాలా స్వేచ్ఛ ఉండేది, షాపింగ్ మాల్ కి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా టైం తెలిసేది కాదు, అలా సాగిపోతూ ఉండేది. కానీ పెళ్ళయాక ప్రతీ విషయం లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు, కానీ నా పని విషయం లో ఆయన తలదూర్చేవాడు కాదు, ఎలాంటి సన్నివేశం చెయ్యడానికి ఆయినా అడ్డు చెప్పేవాడు కాదు, మేమిద్దరం కలిసిన మొదటి రోజు ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలాగే ఉన్నాడు, కానీ కొన్ని విషయాల్లో రూల్స్ పెట్టాడు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.