Naga Chaitanya : ‘దేవర’ చిత్రం పాటని ప్రైవేట్ ఫంక్షన్ లో పాడిన నాగచైతన్య.. వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Naga Chaitanya : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ లోని మొదటి పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసిన ఈ పాట నే వినిపిస్తుంది. అనిరుద్ సంగీత సారథ్యం లో ఇలాంటి అద్భుతమైన పాటలు రావడం కొత్తేమి కాదు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ, తమిళం లో కూడా ఈ పాటకి అత్యధిక వ్యూస్ వచ్చాయి. కేవలం అభిమానులు ప్రేక్షకులకు మాత్రమే కాదు. ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులకు కూడా ఈ పాట బాగా నచ్చింది. అయితే నిన్న రాత్రి నుండి ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ‘తబులా రాసా’ అనే పబ్ లో అక్కినేని నాగ చైతన్య దేవర చిత్రం లోని పాట మైక్ తీసుకొని లైవ్ గా పడుతున్నాడని ఒక వీడియో అప్లోడ్ చేసారు.

Naga Chaitanya
Naga Chaitanya

ఈ వీడియో నిమిషాల వ్యవధిలోనే బాగా వైరల్ అయ్యింది. అలా వైరల్ అవ్వడం తో ఎన్టీఆర్ అభిమానులు, అక్కినేని అభిమానులు క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో లో ఉన్నది అక్కినేని నాగచైతన్య కాదని, ఆ వీడియో లో ఉన్నది జాతి రత్నాలు చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే దూరం నుండి ఇతను చూసేలోపు అచ్చు గుద్దినట్టు నాగ చైతన్య లాగ ఉండడం, హెయిర్ స్టైల్ కూడా అదే విధంగా మైంటైన్ చెయ్యడంతో అందరూ ఒక్కసారిగా నాగచైతన్య అనుకున్నారు.

- Advertisement -

ఇది ఇలా ఉండగా ‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాన్ని విడుదల చెయ్యాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అవ్వడం, ఆయన తన పనుల్లో బిజీ అవ్వడం వల్ల మూడు నెలలపాటు షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని చెప్పడం తో వాయిదా పడింది. ఇప్పుడు ఆ సినిమా స్థానం లో దేవర వస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్ మరియు లిరికల్ వీడియో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండవ పాటకు సంబంధించిన మిక్సింగ్ కూడా పూర్తి అయ్యిందట. త్వరలో ఈ పాటని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here