Samantha : సోషల్ మీడియా ని ఊపేస్తున్న నాగ చైతన్య – సమంత రీ యూనియన్ వీడియో..నిముషాల్లోనే లక్షల వ్యూస్!

- Advertisement -

Samantha : సౌత్ ఇండియాలోనే మోస్ట్ క్రేజీ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత , నాగచైతన్య జంట నెంబర్ 1 స్థానం లో ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి. వీళ్లిద్దరు చట్టపరంగా విడాకులు తీసుకొని విడిపోయారు కానీ, అభిమానులు మాత్రం వీళ్ళిద్దరిని వేరు చేసి చూడలేకపోయారు. వీళ్ళు విడిపోయి దాదాపుగా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఇద్దరు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ గా ఉండిపోయారు.

కానీ సోషల్ మీడియా లో వీళ్లిద్దరి పేర్లను కలిపి ఒక ఫోటో పెట్టినా, వీడియో పెట్టినా లక్షల్లో లైక్స్ , కామెంట్స్ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కలిసి సినిమా చేస్తారో లేదో తెలియదు కానీ, ఒకవేళ చేస్తే మాత్రం టాక్ తో సంబంధం లేకుండా పెద్ద హిట్ అవుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా వీళ్లిద్దరికీ సంబంధించిన వీడియో ఎడిట్ కి లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

అసలు విషయానికి వస్తే నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి ‘తండేల్’ అనే చిత్రం లో నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా వీళ్లిద్దరు కలిసి ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేసారు. అందులో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ని చూసి ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ వీడియో ని సమంత , నాగ చైతన్య ని క్లబ్ చేసి ఎడిట్ చేస్తూ వీడియో చేసారు. ఈ వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయిపోయింది.

- Advertisement -

ఈ వీడియో లో బుజ్జితల్లి అని నాగ చైతన్య పిలిచినప్పుడు సమంత ఎమోషనల్ అవుతున్నట్టు చూపించారు. అది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ వీడియో కూడా అభిమానులు మళ్ళీ వీళ్లిద్దరు కలిస్తే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నాగ చైతన్య హీరో గా నటించిన ‘తండేల్’ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 11 వ తేదీన విడుదల కాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here