Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్, ఆడియన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇస్తూ నేడు ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు కాసేపటి క్రితమే అక్కినేని నాగార్జున అధికారికంగా విడుదల చేసారు. సమంత తో విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే సోషల్ మీడియా లో నాగ చైతన్య శోభిత తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు వినిపించాయి. రూమర్స్ అని మొదట్లో అనుకున్నారు కానీ, ఈ జంట అనేక సందర్భాలలో పార్టీలకు కలిసి వెళ్లడం, వరల్డ్ ట్రిప్స్ వెయ్యడం వంటివి చూసిన తర్వాత నిజమే అని అనుకున్నారు.

నేడు అది నూటికి నూరు శాతం ఖరారు అయ్యింది. ఇకపోతే సమంత కి నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం కి చాలా సంబంధం ఉందట. నాగచైతన్య పట్టుబట్టి మరీ ఆగష్టు 8 వ తారీఖున నిశ్చితార్థం చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉందట. అదేమిటంటే ఆయన సమంత కి తన లవ్ ని ప్రపోజ్ చేసిన రోజు కూడా ఆగస్టు 8 అట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అయితే నాగ చైతన్య ప్రపోజ్ చేసిన రోజు మంచిది కాదని, అందుకే ఆయన సమంత తో విడిపోయారని, అలాంటి తేదీన నాగ చైతన్య మళ్ళీ ఎందుకు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఏ రోజున తన వైవాహిక జీవితం విఫలమై, ఒడిదుడుగులను ఎదురుకోవాల్సి వచ్చిందో, అదే రోజున, అదే తేదిన తన కొత్త జీవితాన్ని మొదలెట్టి పాత జ్ఞాపకాలను సమూలంగా తుడిచివేసే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు అభిమానులు. ఇకపోతే నాగ చైతన్య, శోభిత ఇప్పటి వరకు కలిసి ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించలేదు. శోభిత నాగార్జున మేనకోడలు సుప్రియ ద్వారా నాగ చైతన్య కి దగ్గరైందట. సుప్రియ, శోభిత కలిసి అడవి శేష్ హీరో గా నటించిన ‘గూఢచారి’ చిత్రం లో నటించారు. ఈ సమయం లోనే శోభిత అక్కినేని కుటుంబానికి నాగచైతన్య కి దగ్గరైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్య సంబంధమే సమంత తో విడాకులకు కారణమైంది అనే రూమర్ కూడా సోషల్ మీడియా లో ఇప్పుడు వినిపిస్తుంది.