Naga chaitanya : ఈమధ్య కాలం లో పాపం అక్కినేని హీరోలకు పెద్దగా కలిసి రాలేదు..చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. ఒక్కోసారి ఈ హీరోలకు వచ్చిన క్లోసింగ్ కలెక్షన్స్ ని చూస్తే మరో మంచు ఫ్యామిలీ లాగ అక్కినేని ఫ్యామిలీ కూడా మారబోతుందా..?, టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిల్చిన అక్కినేని ఫ్యామిలీ ని అలా చూడలేకపోతున్నాం అని అభిమానులు బోరున విలపించారు.
కానీ జరిగిపోయింది ఎదో జరిగిపోయింది, ఇక నుండి వచ్చేవి మొత్తం మంచి రోజులే అని రీసెంట్ గా విడుదలైన ‘దూత’ వెబ్ సిరీస్ నిరూపించింది. అక్కినేని నాగ చైతన్య మొదటిసారిగా ఓటీటీ ఎంట్రీ ఇస్తూ అమెజాన్ ప్రైమ్ కి ఈ సిరీస్ ని చేసి పెట్టాడు. విక్రమ్ కె కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శరత్ మరార్ నిర్మించాడు.
ఈ సిరీస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవీ టీం కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేకపోయారు. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ లో అత్యధికంగా జనాలు చూసిన వెబ్ సిరీస్ గా ‘ఫర్జీ’ నిల్చింది. ఇప్పుడు ‘దూత’ ఊపు చూస్తూ ఉంటే ఆ సిరీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి సెన్సేషన్ ని క్రియేట్ చేయబోతుంది అనే సంకేతాలు వస్తున్నాయి.
ప్రతీ ఎపిసోడ్ ఎంతో థ్రిల్లింగ్ గా సీట్ ఎడ్జి లో కూర్చొని చూసేలాగా ఈ సిరీస్ ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. ఈ సిరీస్ ని సినిమా గా చేసి విడుదల చేసి ఉంటే నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచేది కదా అని ప్రతీ ఒక్కరికి అనిపించింది. డిసెంబర్ 1 వ తేదీన విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి రెండు వారాలకు కలిపి దాదాపుగా 50 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయని అంటున్నారు. రోజుకి సగటున రెండు నుండి మూడు మిలియన్ వ్యూస్ వస్తున్నాయట.