Naga chaitanya : అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యకమైన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడిగా జోష్ సినిమాతో గ్రాండ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఏమాయ చేశావే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటూ కెరీర్లో బిజీగా ఉన్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చైతూ దూరంగా ఉంటాడు. బయట కూడా చాలా కూల్ గా, కామ్ గా కనిపిస్తాడు. సినిమా ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా కనిపించరు. కేవలం సినిమాలతో మాత్రమే ఆడియన్స్ ముందుకు వస్తుంటాడు చైతూ.

ఇదిలా ఉంటే.. సినిమా విషయంలో కాకుండా మరో విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు చైతూ. అదేంటంటే.. తాజాగా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు నాగచైతన్య . ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కారు.. Porsche 911 GT3 RS మోడల్ అని తెలుస్తోంది. సిల్వర్ కలర్ లో చాలా స్టైలీష్ గా ఉన్న ఈ కారు ధర దాదాపు రూ.4 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్.. ఒక్క కారుకి రూ.4 కోట్లు పెట్టావా అంటూ అవాక్కవుతున్నారు.
ఇక నాగ చైతన్య ప్రస్తుతం ఆయన కార్తికేయ ఫేం దర్శకుడు చందు మొండేటితో తండేల్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య జాలరిగా కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.