Naga Chaitanya : సమంతతో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత చైతూ పర్సనల్ లైఫ్ గురించి తరచుగా ఏదో ఒక కొత్త రూమర్ క్రియేట్ అవుతూ ఉంది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నాగచైతన్య.. ఈ విషయంపై స్పందించాడు. సమంతతో వివాహం అవ్వకముందు.. నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా ఏమీ తెలియదు.

కానీ సామ్‌తో వివాహం అయ్యి.. విడాకులు అయిన తర్వాత చైతూ పర్సనల్ లైఫ్ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విడాకులు అయిన తర్వాత కూడా ఈ విషయం గురించి స్పందించడానికి చైతూ ఎప్పుడూ వెనకాడలేదు. అదే విధంగా మరోసారి తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలపై తను స్పందించాడు. తన వ్యక్తిగత జీవితంపై అందరూ ఫోకస్ పెట్టడం తనకేం ఇబ్బంది లేదు కానీ తనను వర్క్ పరంగా అందరూ గుర్తుపెట్టుకోవడమే తనకు ఎక్కువగా సంతోషాన్ని ఇస్తుందని బయటపెట్టాడు నాగచైతన్య.

‘‘ఒక పాయింట్ తర్వాత దాని గురించి నేను అసలు పట్టించుకోను. నాతో క్లోజ్‌గా ఉండే మనుషులకు నా గురించి నిజాలు తెలుసు. ఆ విషయం పక్కన పెడితే.. నా పర్సనల్ లైఫ్ ద్వారా నేను అందరికీ తెలియడం కంటే నా వర్క్ పరంగా యాక్టర్‌గా అందరికీ తెలిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. అందుకే నేను నా వర్క్‌పైనే దృష్టిపెట్టాలని అనుకుంటున్నాను. ఇకపై నా సినిమాలే మాట్లాడతాయి. నా సినిమాలు గొప్పగా ఉండి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తే ప్రేక్షకులు నన్ను వాటి ద్వారానే గుర్తుపెట్టుకోవాలి’’ అని నాగచైతన్య అన్నాడు.