Chakri : టాలీవుడ్ లో ఎంతో మంది దిగ్గజ సంగీత దర్శకులు ఉండొచ్చు, కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తారు, వారిలో ఒకరు చక్రి..పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బాచి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా చక్రి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఆల్బమ్స్ ని కంపోజ్ చేసాడు.
ఆయన ఎక్కువగా పూరి జగన్నాథ్ తోనే సినిమాలు చేసాడు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో దాదాపుగా 9 సినిమాలు వచ్చాయి, అవన్నీ మ్యూజికల్ పరంగా పెద్ద హిట్ అయ్యాయి.వాటిల్లో ఇడియట్, దేశ ముదురు , శివమణి వంటి చిత్రాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి.అయితే దురదృష్టం కొద్దీ ఆయన 2014 వ సంవత్సరం లో నిద్రపోతున్న సమయంలోనే గుండెపోటు వచ్చి మరణించాడు.
అయితే చక్రి తన భార్య శ్రావణి తో కలిసి ఎన్నో ఇంటర్వూస్ ఆరోజుల్లో ఇచ్చేవాడు, సినిమాల్లోకి రాకముందే చక్రి కి పెళ్లయింది, కానీ మొదటి భార్య తో విభేదాల కారణం గా 2004 వ సంవత్సరం లో విడాకులు తీసుకొని శ్రావణి ని పెళ్లాడాడు.చక్రి ఉన్నంత కాలం ఆమె ఎంతో సంతోషం తో ఉండేది,వీళ్లిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది.
అయితే చక్రి చనిపోయిన తర్వాత శ్రావణి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.చక్రి తల్లి తండ్రులు శ్రావణి కి ఆస్తులు దక్కకుండా చేసేందుకు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసారు.చక్రి బ్యాంక్ అకౌంట్లు , క్రెడిట్ కార్డులు మరియు పాస్ బుక్ లు అన్ని శ్రావణి కి కనపడకుండా దాచేసారు, చివరికి చక్రి తన భార్య పేరు మీద రాసున్న ఇంటిని కూడా స్వాధీన పర్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసారు, దీనితో శ్రావణి ఎదురు తిరిగి మానవ హక్కుల సంఘం ని ఆశ్రయించి కోర్టు లో కేసు వేసింది.
కోర్టు శ్రావణి కి అనుకూలంగా తీర్పు ఇవ్వగా, ఆ ఇల్లు శ్రావణి పరమైంది.. జూబ్లీ హిల్స్ లో ఈ ఇల్లు ఉంటుంది. అయితే చక్రి చనిపోయిన తర్వాత కూతురు బాధ్యతలు మొత్తం శ్రావణి మొయ్యాల్సి వచ్చింది, ప్రస్తుతం ఆమె జీవనాదారం కోసం ఒక ప్రైవేట్ కంపెనీ లో అకౌంటెంట్ గా పని చేస్తుంది. మహారాణి లాగ భోగాలు అనుభవించాల్సిన శ్రావణి ఇలా ఒక మధ్య తరగతి గృహిణి లాగ జీవించడం చక్రిని అభిమానించే వారికి ఎంతో బాధని కలుగచేస్తుంది.