Anirudh : సింగర్ తో.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లవ్ ఎఫైర్ నిజమేనా..?

- Advertisement -

Anirudh : యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి టాక్ ను అందుకున్నాడు..కొలవరీ సాంగ్ లో ఒక్కసారిగా కోలీవుడ్ పై పట్టుసాధించాడు యంగ్ స్టార్ సినీయర్ డైరెక్టర్లకు గట్టి పోటీని ఇస్తున్నారు..ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కూడా మ్యూజిక్ చేస్తూ.. చాలా చిన్న వయస్సులోనే పెద్ద పేరు సంపాదించాడు. తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా కూడా.. టాలీవుడ్ లోకి కూడా చాలా సునాయాసంగా ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ కూడా తన మార్క్ చూపించాడు అనిరుధ్. అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టి..వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవరకు మ్యూజిక్ చేస్తున్నాడు..

Anirudh
Anirudh

ఈయన సినిమాల పరంగా మంచిటాక్ తో దూసుకుపోతున్నాడు.. కానీ అమ్మాయిల విషయంలో ఫ్లట్ చేస్తుంటాడు అని ఇప్పటికే గతంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.. చాలా మంది హీరోయిన్లను వాడుకొని వదిలేసాడని వార్తలు మొన్నటివరకు వినిపించాయి.. ఇప్పుడు మరో సింగర్ తో ప్రేమలో మునిగి తెలుతున్నాడని ఓ వార్త షికారు చేస్తుంది..సింగర్ జోనితా.. విజయ్ బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ పాడి ఫేమస్ అయ్యింది .అయితే వీరిద్దరి మధ్య బంధం కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో స్ట్రాంగ్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ఆసినిమా టైమ్ నుంచి కలిసి తిరగడం స్టార్ట్ చేశారట ఇద్దరు. ఇక అప్పటి నుంచి ఎక్కడ చూసినా..వీరే కనిపిస్తున్నారంటూ.. కోలీవుడ్ మీడియాలో న్యూస్ కాకరేపుతోంది.

అనిరుధ్ ఎక్కడ ఉంటే జోనితా అక్కడికి వెళ్లిపోతుందట. పబ్లిక్ గానే వీరు కలిసి తిరుగుతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని.. త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారంటున్నారు. అయితే ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఈ ఇద్దరిలో ఎవరూ.. స్పందించకపోవడం పై ఆ వార్తలు నిజమని నమ్ముతున్నారు..ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here