GV Prakash: విడాకులు తీసుకున్న మరో స్టార్ హీరో.. దయచేసి అలా చేయొద్దంటూ పోస్ట్

- Advertisement -

GV Prakash: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదర్చిన వివాహమైన ఏదో ఒక కారణంతో విడిపోతున్నారు. అలా బాలీవుడ్ టు టాలీవుడ్ వరకు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. రెండేళ్ల క్రితం హీరో ధనుష్‌, ఐశ్వర్య ల విడాకుల ప్రకటన ఇండస్ట్రీ వర్గాలతో పాటు సాధారణ ప్రజలకు కూడా షాకిచ్చింది. 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

తాజాగా మరో హీరో విడాకులు తీసుకుని షాకిచ్చాడు. ప్రముఖ సంగీత డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా రిజల్ట్ తో పనిలేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలకు తగ్గకుండా చేస్తున్నాడు. ఆయన నటించిన మూడు సినిమాలు నాలుగు నెలల గ్యాప్ లోనే విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు ఫర్వాలేదు అనిపించుకుంటే.. మరికొన్ని మాత్రం ప్లాప్ అయ్యాయి. అయితే జీవి ప్రకాష్ తాను విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన అభిమానులు కంగుతిన్నారు.

- Advertisement -

హీరో జీవీ ప్రకాష్ కూడా తన భార్య సైంధవికి విడాకులు ఇచ్చాడు. తాజాగా దీనిపై అఫీషియల్ గా ప్రకటన కూడా ఇచ్చాడు. తన ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేస్తూ .. ఎంతో ఆలోచించాం. చివరికి విడిపోవాలని నేను, సైంధవి నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మా విడాకులు.. మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని, అలాగే మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా నిర్ణయం ఇద్దరికి మంచిదని భావించిన తర్వాతే విడాకులకు సిద్ధమయ్యాం.. అని పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by G.V.Prakash Kumar (@gvprakash)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here