Murari సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రాలుగా పేరొందిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో మురారి చిత్రం కచ్చితంగా ఉంటుంది. ‘రాజకుమారుడు’ సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కి, వరుసగా యువరాజు, వంశీ వంటి చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆ తర్వాత ఆయనకి కృష్ణ వంశీ దర్శకత్వం లో ‘మురారి’ చిత్రం చేసే అవకాశం దక్కింది. అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం, కుటుంబ కథా చిత్రాలలో ఒక ట్రెండ్ సెట్టర్ గా, బెంచ్ మార్క్ గా నిల్చింది. అంతే కాకుండా మహేష్ బాబు కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజిని తెచ్చిపెట్టేలా చేసింది.
ఈ చిత్రంలోని పాటలు, ఎమోషనల్ సన్నివేశాలు, మహేష్ బాబు అద్భుతమైన నటన, ఇలా ఒక్కటా రెండా ఎన్నో అంశాలు ప్రేక్షకులను చిరకాలం గుర్తించుకునేలా చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 వ తారీఖున గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. సరికొత్త 4K టెక్నాలజీ తో, అద్భుతమైన కలర్ గ్రేడింగ్ తో, ఒక కొత్త సినిమాని చూసే విధమైన క్వాలిటీ తో రీ మాస్టర్ చేశారట. అయితే సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి ఒక ప్రముఖ వెబ్ సైట్ ఒక కథనం లో పేర్కొంటూ మురారి చిత్రం అప్పట్లో ఫ్లాప్ అయ్యింది అని సంబోదించాడు.
ఇది ఆ చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ దృష్టిలోకి వచ్చింది. ఆయన స్పందిస్తూ ‘ నేను ఆరోజుల్లో నిర్మాత రామలింగేశ్వర రావు గారి దగ్గర 55 లక్షల రూపాయిలను పెట్టి 5 సంవత్సరాలకు గాను మురారి మూవీ తూర్పు గోదావరి జిల్లా హక్కులను కొనుగోలు చేశాను. మొదటి రిలీజ్ అప్పుడు ఈ చిత్రానికి కోటి 32 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అని చెప్పేందుకు కలెక్షన్స్ ని పరిగణలోకి తీసుకుంటే, మురారి చిత్రం ఫ్లాప్ అయ్యిందా, హిట్ అయ్యిందా అనేది మీకే అర్థం అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క మహేష్ బాబు అభిమానులు మురారి చిత్రం ఫ్లాప్ అయ్యింది అని కామెంట్ చేసినందుకు సదరు వెబ్ సైట్ యాజమాన్యం ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో బండ బూతులు తిడుతున్నారు.