Murari Re-Release : మురారి రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు.. కొత్త సినిమాలు దరిదాపుల్లో లేవుగా!

- Advertisement -

Murari Re-Release : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నిన్న ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో సంబరాలు చేసుకున్నారో మనమంతా చూసాము. ప్రతీ ఏడాది ఆయన పుట్టినరోజుకి అభిమానులు మహేష్ బాబు కి సంబంధించిన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా ఈసారి ‘మురారి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు. ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు కూడా ఊహించలేకపోయారు. ఎందుకంటే అభిమానులు ఈసారి ‘ఖలేజా’ చిత్రం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసారు.

 Murari Re-Release
Murari Re-Release

కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం విడుదల సాధ్యం కాదని, ఈసారికి మురారి చిత్రంతో సరిపెట్టుకోమని మహేష్ బాబు టీం అభిమానులకు చెప్పడంతో కాస్త నిరాశకి గురయ్యారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ సినిమాకి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి నిన్న బ్రహ్మరథం పట్టారు. కొన్ని చోట్ల ప్రేమజంటలు థియేటర్స్ లో పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు కూడా నిన్న మనం చూసాము. ఇక వసూళ్ల విషయానికి వస్తే, ఈ చిత్రానికి నిన్న కేవలం నైజాం ప్రాంతం నుండి మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు 5 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం.

Murari 4K re-release: Mahesh Babu's film sets a new record with its pre-sales

- Advertisement -

ఇప్పటి వరకు ఖుషి చిత్రం రికార్డు చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్నింది. కానీ ఈసారి ఖుషి ఫుల్ రన్ రికార్డు ని నైజాం లో మురారి చిత్రం మొదటి రోజే బ్రేక్ చేసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక నేడు రేపు కూడా వీకెండ్ అవ్వడం తో ఈ చిత్రం ఖుషి రీ రిలీజ్ ఫుల్ రన్ 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఈ రికార్డు ని వచ్చేనెలలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వెయ్యబోతున్న ‘గబ్బర్ సింగ్’ తో బద్దలు కొడతారా లేదా అనేది చూడాలి.

Mahesh Babu's Murari 4k Re-Releasing Soon! - TrackTollywood

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here