Muralidhar Goud : ఈ మధ్య కాలం లో వస్తున్న ప్రతీ చిత్రం లో క్యారక్టర్ ఆర్టిస్టుగా సందడి చేస్తున్న వారిలో ఒకడు మురళి ధర్ గౌడ్. ఈయన ‘డీజీ టిల్లు’ సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ‘బలగం’ చిత్రం తో ఇతని జాతకమే మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణ మాండలికం లో వచ్చే సినిమాల్లో ఈయన కచ్చితంగా ఉండాల్సిందే. అలా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి.

అయితే ఈమధ్య కేవలం తెలంగాణ మాండలికం లో వచ్చే సినిమాల్లోనే కాకుండా, మామూలు సినిమాల్లో కూడా బాగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈయన సహజ నటన కారణంగా చంద్ర మోహన్ మరియు కోట శ్రీనివాస రావు తరహా లో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఉన్నాయి. తండ్రి పాత్రలకు ఈయన రాబొయ్యే రోజుల్లో రోల్ మోడల్ గా మారే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన నిజ జీవితం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

సినిమాల్లోకి రాకముందు మురళి ధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అట. కానీ సినిమాల్లో నటుడిగా ఎదగాలి అని మొదటి నుండి కోరిక బలంగా మనసులో ఉండేది అట. ఆ కోరిక తోనే బంగారం లాంటి ఉద్యోగం ని వదిలేసి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. అయితే ఒక సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు, నేను నటించి చూపించొచ్చా సార్ అని డైరెక్టర్ ని అడిగాడట.

బిచ్చగాడి లాగ ఇందాకటి నుండి చూస్తూ ఉన్నావ్, ఏమి చేస్తావో చెయ్యి అని అనగానే, మురళి ధర్ గుడి ముందు దీనంగా అడుక్కుంటూ బిచ్చం ఎత్తుకునే ఒక అభాగ్యుడి పాత్రలో జీవించి చూపించాడట. దీంతో ఆ డైరెక్టర్ చప్పట్లు కొట్టి, మురళి ధర్ కి తానూ కూర్చున్న కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాడట. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
