Avinash: బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో కోసం ఎంతో మంది తమ పనులు మానేసుకుని టీవీలకు అతుక్కుపోతుంటారు. యూట్యూబ్ లో కూడా ఈ షో పాత ఎపిసోడ్ లను మళ్లీ మళ్లీ చూస్తుంటారు. ఆ షో ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించింది. జబర్దస్త్ ద్వారా చిన్న కంటెస్టెంట్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. మొదట కంటిస్టెంట్ గా జబర్దస్త్ కు వచ్చి.. ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి ఏళ్ల తరబడి జబర్దస్త్ లో పనిచేశాడు. 2020లో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు అవినాష్.
తాజాగా జబర్దస్త్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాలకు, రెమ్యునరేషన్ కు సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ లో రాజకీయాలు ఉంటాయని నేను ఒప్పుకుంటా అంటూ తన అనుభవాన్ని వివరించాడు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు ఉన్నా అవి నా దగ్గర చెల్లేవి కాదన్నారు. ఒక వేళ ఎవరైనా ఏదైనా ఆశించి వస్తే వెంటనే తనకు తెలిసి పోయేదన్నారు. నా దగ్గర నాంచొద్దు.. అసలు మేటర్ ఏంటని అడిగేసే వాడినని.. దాంతో వాళ్ళ రాజకీయాలు నా దగ్గర పనిచేయలేదంటూ వివరించాడు. అలాగే జబర్దస్త్ టీం లీడర్స్, డైరెక్టర్లతో కూడా నాకు మంచి సాహిత్యం ఉండేదని చెప్పారు. ఏదైనా నేను వారితో ఫ్రీగా మాట్లాడేసే వాడిని.. అందుకే నేను అక్కడ నెగ్గుకు రాగలిగానంటూ వివరించాడు. అయితే 2020లో బిగ్‌బాస్ అవకాశం రావడంతో నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని. ఆ సమయంలో అగ్రిమెంట్ బ్రేక్ చేసినందుకు నాతో 10 లక్షలు కట్టించుకున్నారని చెప్పుకొచ్చాడు.
అయితే జబర్దస్త్ రెమ్యునరేషన్ మాత్రం తక్కువగానే వచ్చేదన్నాడు. టీం లో ఉన్న కంటెస్టెంట్స్‌కు పని చేసినందుకు పేమెంట్ ఇచ్చిన తర్వాత టీం లీడర్ గా నాకు వారానికి రూ.7 నుంచి 8 వేలు మాత్రమే మిగిలేవన్నారు. అయితే జబర్దస్త్ ఫేమ్ ద్వారా వచ్చిన ఈవెంట్లతో మాకు డబ్బులు బాగా వచ్చేవని.. జబర్దస్త్ ద్వారా తక్కువ రెమ్యునరేషన్ వచ్చినా.. దాని వల్ల వచ్చే ఈవెంట్లతో మాకు సంపాదన బాగానే ఉండేదని అవినాష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అవినాష్ జబర్దస్త్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.