Mrunal Thakur : నిమిషానికి 10 లక్షలు ఇస్తేనే వస్తాను అంటున్న మృణాల్ ఠాకూర్..!

- Advertisement -

Mrunal Thakur : ప్రస్తుతం మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు రెండే. ఒకటి శ్రీలీల, మరొకటి మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం అవకాశాలు మొత్తం వీళ్ళిద్దరికే వస్తున్నాయి. శ్రీలీల కి అయితే చేతిలో డజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ అమ్మాయి స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవేమి చూడకుండా కేవలం రెమ్యూనరేషన్ బలంగా ఆఫర్ చేస్తున్నారని సినిమాలు చేస్తున్నట్టుగా అనిపించింది ఆమె రీసెంట్ సినిమాలు చూస్తుంటే.

ఇక మృణాల్ ఠాకూర్ కి అయితే అవకాశాలు శ్రీలీల రేంజ్ లోనే వస్తున్నాయి కానీ, ఆమె స్క్రిప్ట్ మరియు తన పాత్రకు ప్రాముఖ్యత ఉందా లేదా అనేది చూసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్స్ ఎంచుకుంటుంది. సీతారామం తర్వాత ఆమె చేసిన లేటెస్ట్ చిత్రం ‘హాయ్ నాన్న’ ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ ఏ రేంజ్ లో ఉంది అనేది.

ఇకపోతే మృణాల్ ఠాకూర్ ఇతర హీరోయిన్స్ లాగ ఎక్కువగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ రావడం మనం ఎప్పుడు చూడలేదు. చూసినా కూడా చాలా తక్కువగానే ఉంటుంది. చిన్న చిన్న హీరోయిన్లు కూడా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వస్తున్నారు కదా, మృణాల్ ఠాకూర్ కి ఏమైంది?, ఆమెకి క్రేజ్ లేదా అని చాలా మందికి అనిపించొచ్చు.

- Advertisement -

కానీ ఆమె షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చేందుకు అడుగుతున్న రెమ్యూనరేషన్స్ చూసి హడలిపోయి పిలవడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఒక నిమిషానికి ఆమె పది లక్షల రూపాయిలను డిమాండ్ చేస్తుందట. ఎంతసేపు అయితే షాపింగ్ మాల్ లో ఉంటుందో, అంతసేపు ఆమె కోరినంత డబ్బులు ఇవ్వాలట. శ్రీలీల కూడా ఆ రేంజ్ లో డిమాండ్ చెయ్యడం లేదు, అందుకే అందరూ శ్రీలీల వైపు చూస్తున్నారు కానీ, మృణాల్ ఠాకూర్ ని పట్టించుకోవడం లేదని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here