Mrunal Thakur : సీరియల్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ ని తెచ్చుకొని, ఆ తర్వాత బుల్లితెర మీద అనేక ఎంటర్టైన్మెంట్ షోస్, డ్యాన్స్ షోస్ లో కనిపించి, ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలను సంపాదించి, ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్టున్న నటి మృణాల్ ఠాకూర్. కేవలం అందం ఉంటే చాలు, అవకాశాలను ఒడిసిపట్టుకోవచ్చు అనే మైండ్ సెట్ ఉన్న హీరోయిన్స్ ఉన్న ఈ కాలం లో మృణాల్ ఠాకూర్ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకుంది.

ఈమె ‘సీతారామం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం. అంతకు ముందు ఈమె హిందీ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగు లో ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజ్ ని సంపాదించుకుంది.

ఈ సినిమా తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం చేస్తుంది. ఈ సీనియా ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే మృణాల్ ఠాకూర్ సినిమాల ద్వారా వచ్చిన తక్కువ సమయం లోనే బాగానే సంపాదించింది. ఆ సంపాదించిన డబ్బులతో ఇప్పుడు ఈమె ప్రాపర్టీస్ ని కొనసామ్ ప్రారంభించింది.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కి సంబంధించి అథేరీ లో ఒక అందమైన ఫ్లాట్ ని కొనుగోలు చేసింది. ఇది గతం లో కంగనా రనౌత్ తండ్రి అమర్ దీప్ రనౌత్ తన సోదరుడి జోడికి ఇచ్చిన ఫ్లాట్ అది. ఇది ఆ తర్వాత కొన్నాళ్ళకు కంగనా రనౌత్ చేతికి వచ్చింది. ఆమె ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి చాలా తక్కువ రేట్ కి ఈ ఫ్లాట్ ని అమ్మినట్టు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.
