లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. అత‌నే నా భ‌ర్తంటున్న సీతారామం బ్యూటీ

- Advertisement -

గతేడాది సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మృణాల్ ఠాకూర్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రేక్షకులకు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇప్పుడు ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో బిజీ అయిపోయింది. ఇటీవలే బోల్డ్ వెబ్ సిరీస్ ల‌స్ట్ స్టోరీస్ 2తో నటించి ప్రేక్షకులను అలరించింది.

మృణాల్ ఠాకూర్‌
మృణాల్ ఠాకూర్‌

ప్రస్తుతం టాలీవుడ్ లో న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే రౌడీ బాయ్​ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌రుశురామ్ కాంబినేష‌న్ లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అందులో మృణాల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదేకాకుండా మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు కూడా మృణాల్ చేతిలో ఉన్నాయి. ఇది పక్కన పెడితే.. ఈ అందాల సోయ‌గం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కి సంబంధించిన అనేక విష‌యాల‌ను పంచుకుంది.

ఈ క్ర‌మంలోనే తన ఫస్ట్ క్రష్ ఎవరో బయటపెట్టింది. అంతే కాకుండా తనకు ఎలాంటి భర్త కావాలో కూడా చెప్పుకొచ్చింది. ఇంత‌కీ అందాల మృణాల్ ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో తెలుసా.. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్.. అవును షాహిద్ క‌పూర్ అంటే చాలా ఇష్టమట.. అత‌నే నా ఫస్ట్ క్రష్ అంటూ మృణాల్ వెల్ల‌డించింది. ఇండస్ట్రీలోకి రాకముందు షాహిద్ ఫోటోలు ఎక్కడ కనిపించినా కూడా కట్ చేసి బుక్ లో అతికించుకునేదట. షాహిద్ క‌పూర్ అంటే అంత ఇష్టమట. త‌న ఫ‌స్ట్ క్ర‌ష్ అయిన షాహిద్ క‌పూర్ తో మృణాల్ జెర్సీ మూవీ చేసింది. ఇక భవిష్యత్తులో తనకు కాబోయే వాడు తన వృత్తిని పూర్తిగా అర్థం చేసుకుని త‌న‌ను గౌర‌వించే, ప్రేమించే వాడై ఉండాలట. దీంతో మృణాల్ వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here