Mrunal Thakur : సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నారు మృణాల్. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారని చెప్పాలి ఈమె రెమ్యూనరేషన్ పరంగా వచ్చిన అవకాశాలన్నింటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా సినిమా కథలో కంటెంట్ ఉందా లేదా అన్న విషయాలను చూసి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.ఈ అమ్మడు రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచేశారు.

తాజాగా హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. అయితే డిమాండ్ ఉన్న హీరోయిన్లను వ్యాపార సంస్థల ఓపెనింగ్స్ కు పిలవడం కామన్. ఇలా చాలా మంది హీరోయిన్లు రెండు చేతులా సంపాదిస్తున్నారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం లక్షలు తీసుకుంటున్నారు. ఇక మృణాల్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి రావాలి అంటే ఆ షాపింగ్ మాల్ లో ఎన్ని నిమిషాలు ఉంటే.. అన్ని నిమిషాలకు అన్ని లక్షలు డిమాండ్ చేస్తుందట.

అంటే… గంటకు పైన ఉంటే.. ఆరుకోట్లు ఆమెకు సమర్పించుకోవాల్సిందే. దాంతో యజమానులు భయపడిపోతున్నారు. షాపింగ్ మాల్ లో ఎన్ని గంటలు ఉంటే అంత మొత్తంలో డబ్బు ఇవ్వాలని అడగడంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎవరు కూడా ఈమెను పిలవడంలేదు. ఇక సినిమాల పరంగా దూసుకుపోతోంది బ్యూటీ. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడీగా ఫ్యామిలీ స్టార్ లో నటిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.