Mrunal Thakur : నా బాడీలోని ప్రైవేట్ పార్ట్స్ గురించి దారుణంగా మాట్లాడారు.. సె*క్సీగా లేనని ముఖం మీదే చెప్పారు: మృణాల్‌ ఠాకూర్‌

- Advertisement -

Mrunal Thakur : ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది మరాఠి బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. నిజానికి ఆమె సినీ ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చింది. మొదట టీవీ సీరియల్స్‌తో నటించిన ఆమె మెల్లిగా వెండితెరపై మెరిసింది. సీతారామంకు ముందు హిందీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమె పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, సీతారామం సినిమా ఆమెను ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసింది. చక్కటి ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది.

ఇక ఆ సినిమా అంత హిట్‌ అవ్వడానికి ఒక ముఖ్య కారణం ‘సీత’ క్యారెక్టర్‌ అని చెప్పొచ్చు. ఆ రోల్‌లో మృణాల్‌ ఠాకూర్‌ అంతలా ఒదిగిపోయారు. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది‌. ప్రస్తుతం స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న ఈ బ్యూటీ.. కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తాను బాడీషేమింగ్‌ను ఎదుర్కొన్నానంటూ వాపోయింది. ముఖ్యంగా హిందీలో సినిమాలు చేసే టైంలో చాలా ఇబ్బందులకు గురయ్యానంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

“గతంలో నేను ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. అక్కడ నా బాడీని ఉద్దేశించి కామెంట్స్‌ చేశారు. ‘మీరు అస్సలు సెక్సీగా లేరు.. నిజానికి పాత్ర సెక్సీ ఉంది.. కానీ ఆ పాత్రకు మీరు సెట్‌ కాలేదు. అంత అందంగా కనిపించలేదు’అంటూ దారుణంగా మాట్లాడారు. ఓ ఫొటోగ్రాఫర్ నా పాత్రను చూడకుండానే నా లుక్‌పై కామెంట్‌ చేశాడు. అతడు మరాఠీలో మాట్లాడుతూ మరో ఫొటోగ్రాఫర్‌తో ఇలా అన్నాడు. ఈ పల్లెటూరి అమ్మయి ఎవరు? అని అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడు. కానీ ఆ తర్వాత అతడు మళ్లీ నాకు క్షమాపణలు చెప్పాడు. అయితే, ఓ సాంగ్‌లో నటించేటప్పుడు ఏకంగా నన్ను బరువు తగ్గమని సూచించారు. అప్పుడు నేను నా శరీర బరువు గురించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అలాంటప్పుడు మీరేందుకు అంతగా ఫీల్‌ అవుతున్నారని గట్టిగా ఇచ్చిపడేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here