Mrunal Thakur : రీసెంట్ గానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ కి రీచ్ అయినా వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ సినిమాతో ఆమె ఒక పక్క తన అందంతోనూ, మరోపక్క తన నటనతోనూ ప్రేక్షకులను అశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగు లో మళ్ళీ మరో సినిమా చెయ్యడానికి గ్యాప్ తీసుకుంది.
సుమారుగా ఏడాది గ్యాప్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని తో ఆమె ‘హాయ్ నాన్న’ అనే సినిమా చేసింది. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. నటిగా కూడా మృణాల్ ఠాకూర్ కి మంచి పేరుని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. కేవలం థియేట్రికల్ పరంగా మాత్రమే కాదు, ఓటీటీ లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 5 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమెని ఒక యాంకర్ ప్రశ్న అడుగుతూ ‘మీరెందుకు మిగతా హీరోయిన్స్ లాగ వేగంగా సినిమాలు చెయ్యడం లేదు?’ అని అంటుంది.
దానికి మృణాల్ ఠాకూర్ సమాధానం చెప్తూ ‘నిదానమే ప్రధానం అని పెద్దలు చెప్తూ ఉంటారు. దానిని నేను బలంగా నమ్ముతాను. చేసే ప్రతీ సినిమా ప్రేక్షకుడికి బాగా నచ్చాలి, ఆ సినిమా ద్వారా నేను గుర్తుండిపోవాలి. అలాంటి పాత్రలు దొరికేవరకు నేను ఎదురు చూస్తాను. ఒక సినిమాకి నేను సంతకం చేసానంటే కచ్చితంగా ఆ సినిమాని చూడొచ్చు అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవాలి, అలాంటి బ్రాండ్ ఇమేజి కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. తొందరపడి ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకూడదు. అలా చెయ్యడం వల్ల రీసెంట్ గా ఒక హీరోయిన్ కి ఎలాంటి ఫ్లాప్స్ వచ్చాయో మీరే చూసారు’ అంటూ శ్రీలీల ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేసింది.