Mrunal Thakur : అందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందట మృణాల్ ఠాకూర్..?

- Advertisement -

Mrunal Thakur : సీతా రామం సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది మృణాల్ ఠాకూర్. ఆమె నేడు తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నారు. 1992లో ఆగస్టు 1 న పుట్టిన మృణాల్ నేటితో 30ఏళ్లు పూర్తి చేసుకుని 31వ ఏట అడుగుపెట్టబోతుంది. తాను 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక హిందీలో లవ్‌ సోనియా చిత్రంలో నటించారు. ఈ సినిమాలో తాను పోషించిన వేశ్యపాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇటీవల ఆమె సీతారామం సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.

Mrunal Thakur
Mrunal Thakur

ఇది ఇలా ఉంటే తనకు ఈ సక్సెస్‌ ఒక్కరోజులోనో, ఒక్క సినిమాతోనో వచ్చింది కాదని పలుమార్లు చెప్పుకొచ్చింది. మృణాల్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయట. అంతే కాకుండా ఓ సారి తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించిందట. మృణాల్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.. మరాఠి,హిందీ సీరియల్స్ నటిస్తుండగా అమ్మడికి సినిమాల్లో చేయాలని బాగా కోరిక ఉండేదట. హీరోయిన్ అయిపోవాలని కలలు కనేదట. ఈ క్రమంలోనే ప్రయత్నాలు చేస్తుండగా చాలామంది నీకేం నటన వస్తుందని హేళనగా మాట్లాడేవారట. నువ్వు సీరియల్ యాక్టర్ వి హీరోయిన్ అయిపోదామని కలలు కంటున్నావా అంటూ చాలా చీప్ గా చూసేవారట. ఈ అవమానాలను భరించలేక సూసైడ్ చేసుకోవాలని అనుకుందట. కానీ ఇండస్ట్రీలో దశాబ్ధం పాటు పోరాటం చేసి సీతారామం సినిమాతో కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ కెరీర్లో తిరిగి చూసుకునే పని లేని విధంగా దూసుకుపోయింది. ఇటీవల లస్ట్ స్టోరీస్ 2లో తన అంద చందాలతో బోల్డ్ సీన్స్ లో నటించి అలరించింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here