Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ .. ప్రస్తుతం ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఈమె దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటి దక్కించుకుంది. ఓ పక్క ప్రిన్సెస్ నూర్జహాన్ గా, మరోపక్క సీతా మహాలక్ష్మి గా తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అచ్చ తెలుగు ఆడపిల్లల చీరకట్టు, సాంప్రదాయంతో కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ మొదట బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది.

కానీ అక్కడ చేసిన సినిమాలన్నీ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్‌కి మకాం మార్చింది. ఇక టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక్కడే స్థిర పడిపోయింది. ఇక బాలీవుడ్‌లో మృణాల్ లవ్ సోనియా అనే సినిమాలో ఓ వేశ్య పాత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రకు 100శాతం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నిజంగానే మృణాల్ బ్రోతల్ హౌసుకు వెళ్లి అక్కడ 15 రోజులు గడిపిందట. చాలా దగ్గర నుంచి వారిని అబ్జర్వ్ చేసిందట. దీంతో ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్లు బాగా పండించింది.

అయినప్పటికీ.. ఈ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా సక్సెస్ అయిన.. కాకపోయినా.. మృణాల్ డెడికేషన్ చాలా బాగుంటుందన్న ప్రశంసలు మాత్రం దక్కాయి. తన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ.. నెటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల మృణాల్ న్యాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్నతో పలకరించింది. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో చేస్తోంది.