Mr. Bachchan Review : ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫుల్ రివ్యూ..ఆ ఒక్క విషయం లో జాగ్రత్త పడాల్సింది!

- Advertisement -

నటీనటులు : రవితేజ, భాధ్యశ్రీ భొర్సే, జగపతి బాబు, సత్య తదితరులు.
సంగీతం : మిక్కీ జె మేయర్.
దర్శకత్వం : హరీష్ శంకర్ .
సినిమాటోగ్రఫీ: అయానక బోసే.
ఎడిట‌ర్ : ఉజ్వల్ కులకర్ణి.
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్.

Mr. Bachchan Review ‘మిరపకాయ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజ రవితేజ తో హరీష్ శంకర్ భారీ గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘రైడ్’ అనే చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ కారణంగా హైప్ భారీ గా ఏర్పడింది. మార్కెట్ లో కూడా బిజినెస్ రవితేజ రీసెంట్ సినిమాలకంటే గొప్పగా జరిగింది. అలాగే ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన ‘భాగ్యశ్రీ భొర్సే’ కూడా ఈ సినిమా కి హైప్ పెంచడం లో ఒక భాగం అయ్యింది. ఈమె అందచందాలు చూసి కుర్రకారులు పిచ్చెక్కి పోయారు. మరి ఇన్ని ప్రత్యేకతలు నడుమ నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకుండా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాం.
Mr. Bachchan Review
Mr. Bachchan Review

కథ :

నిజాయితీగా పని చేసే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ఆనంద్ అలియాస్ మిస్టర్ బచ్చన్(రవితేజ), ఒక అవినీతి పరుడైన పొగాకు కంపెనీ నడిపే వ్యాపారి పై రైడ్ చెయ్యడంతో సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంత ఊరు కోటిపల్లి కి వచ్చేస్తాడు. అక్కడ జిక్కీ(భాగ్యశ్రీ భొర్సే) ని చూసిన వెంటనే ప్రేమలో పడుతాడు. అలా వీళ్లిద్దరి లవ్ ట్రాక్ సాగుతుండగా ఆనంద్ కి మళ్ళీ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందిగా కబురు అందుతుంది. ఉద్యోగం లో చేరిన వెంటనే ఎంపీ ముత్యాల సుబ్బయ్య (జగపతి బాబు) ఇంటిపై రైడింగ్ చెయ్యాలని ఆదేశాలు వస్తాయి. తన ఇంటిపై రైడింగ్ కి వచ్చే అధికారులను భయపడేలా చేసే ముత్యాల సుబ్బయ్య ఇంట్లో మిస్టర్ బచ్చన్ రైడింగ్ ఎలా చేసాడు?, దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురుకున్నాడు?, చివరికి ఏమి జరుగుతుంది అనేది మిగిలిన స్టోరీ.

- Advertisement -

Video : Nallanchu Thellacheera Promo – Mr.Bachchan (Ravi Teja, Bhagyashri ) | Latest Telugu Movie Videos

విశ్లేషణ:

ఒక నిజాయితీగల ఐటీ ఆఫీసర్ సరైన డ్యూటీ చేస్తే సిస్టం ఎలా రన్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీద హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టేకింగ్ పరంగా, హీరో క్యారక్టర్ పరంగా పలు జాగ్రత్తలు తీసుకున్న హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే ని నడిపించిన విధానం లో మాత్రం విఫలం అయ్యాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం టైం పాస్ గా నడిచినప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య వచ్చే సన్నివేశాలను ఇంకా బాగా రాసుకొని ఉంటే అదిరిపోయేది. ఈ సినిమాకి హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంత ప్లస్ అయ్యాయో, అంతే మైనస్ అయ్యాయి. అవసరం లేని చోట్ల కమర్షియల్ హంగులు దిద్దడం వల్ల కథకి అడ్డం పడినట్టుగా అనిపించింది. ఓవరాల్ గా ఈ చిత్రం చూసినప్పుడు యావరేజ్ అని సదరు ప్రేక్షకుడికి అనిపిస్తుంది.

Mr Bachchan Movie (2024): Release Date, Cast, Ott, Review, Trailer, Story, Box Office Collection – Filmibeat

ఇక నటీనటుల విషయానికి వస్తే రవితేజ ఈ చిత్రం లో చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. తన పాత్రకి తగ్గట్టుగా బ్యాలన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తూనే, ఎంటర్టైన్మెంట్ మరియు హీరోయిజం ని అద్భుతంగా పండించాడు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రానికి ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం ఆమెనే. హైప్ కి తగ్గట్టుగానే ఈ హాట్ బ్యూటీ వెండితెర మీద మెరిసిపోయింది. నటన కూడా చాలా చక్కగా చేసింది. టాలీవుడ్ లో ఈమె రాబొయ్యే రోజుల్లో టాప్ స్థానంకి వెళ్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ లో నిల్చిన మరొకరు కమెడియన్ సత్య. ఫస్ట్ హాఫ్ లో ఈయన కామెడీ ట్రాక్ వర్కౌట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగుంది, మిక్కీ జె మేయర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరాయి. కానీ ఎడిటింగ్ విషయం లో జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే బాగుండేది. చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించాయి.

చివరి మాట :

Mr. Bachchan - The Only Hope (2024) - Movie | Reviews, Cast & Release Date in tirupati- BookMyShow

కాసేపు టైం పాస్ కోసం థియేటర్ కి వెళ్లేవారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. మంచి స్టోరీ లైన్ ని సరైన స్క్రీన్ ప్లే తో హరీష్ శంకర్ నడిపించి ఉంటే ఈ సినిమా ‘మిరపకాయ్’ కంటే పెద్ద హిట్ అయ్యేది.

రేటింగ్ : 2.5 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here