Mr. Bachchan మొట్టమొదటి రివ్యూ..క్రాక్ తర్వాత రవితేజ కి పర్ఫెక్ట్ కం బ్యాక్!

- Advertisement -
Mr. Bachchan టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు హరీష్ శంకర్. షాక్ సినిమాతో ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత మిరపకాయ్ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ చిత్రం ఏ స్థాయిలో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన కెరీర్ వేరే లెవెల్ కి వెళ్తుందని అనుకున్నారు కానీ, మధ్యలో ఫ్లాప్స్ రావడం వల్ల బాగా డీలా పడ్డారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన మాస్ మహారాజా రవితేజ తో కలిసి ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Mr. Bachchan
Mr. Bachchan

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లిమ్స్, టీజర్ మరియు పాటలకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘రైడ్’ కి రీమేక్ గా తెరకెక్కింది. పేరుకి రీమేక్ కానీ , కేవలం స్టోరీ లైన్ ని తీసుకొని మన కమర్షియల్ మూవీ ఆడియన్స్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖులకు, పలు ప్రాంతాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ కి వేసి చూపించారు. వారి నుండి ఈ సినిమాకి అద్భుతమైన రిపోర్ట్ వచ్చింది.

Mr Bachchan: Ravi Teja wishes fans happy Valentine's Day with new poster - Hindustan Times

ముఖ్యంగా రవితేజ, జగపతి బాబు మధ్య నువ్వా నేనా అంటూ సాగే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిల్చాయట. రవితేజ ని ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా లో చూపిస్తే ఆడియన్స్ అందరికీ పండగే, బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురుస్తుంది. ఈ చిత్రం ఆ విధంగానే ఉంటుందట. అలాగే ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన భాగ్యశ్రీ భోర్సే నటన, అందచందాలు కూడా ఈ చిత్రానికి హైలైట్ గా నిల్చినట్టు సమాచారం. ఓవరాల్ గా చాలా కాలం నుండి ఒక్క పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక విందు భోజనం లాగ ఉండబోతుందని సమాచారం. మరి ఈ రివ్యూ లో ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

- Advertisement -

మిస్టర్ బచ్చన్' నుంచి రవితేజ షో రీల్ విడుదల | Raviteja Mister Bachchan ShowReel Out Now | Sakshi

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here