సినిమా సెలబ్రిటీలపై నిత్యం అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. వాళ్ల సినిమా వార్తలతో పాటు వారి వ్యక్తిగత విషయాలను సైతం వైరల్ చేస్తుంటారు అభిమానులు. ఇక సినీ తారలంతా కోట్లల్లో సంపాదిస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారని భావిస్తుంటారు. అయితే కొందరి విషయాల్లో ఇది నిజమే అయినప్పటికీ మరికొందరికి మాత్రం వ్యతిరేకంగా జరుగుతుంటుంది. కొందరు నటులు వారి జీవితంలో నిత్యం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటుంటారు. తాజాగా ఓ హీరోయిన్ తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సమస్యల గురించి వివరించింది. ఓకానొక సందర్భంలో ఓ నిర్మాత టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పింది.
ఫేమస్ హిందీ టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ నిర్మాత తనను టార్చర్ చేశాడని మోనికా భడోరియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ షోలో మోనికా భడోరియా.. బావ్రీ పాత్రతో మెప్పించింది. అయితే ఈ పాత్ర చేసే సమయంలో తన తల్లి క్యాన్సర్ బారిన పడిందని చెప్పుకొచ్చింది. “అమ్మకి క్యాన్సర్ వచ్చిన సమయంలో రాత్రంతా ఆస్పత్రిలో ఆమె వద్దే ఉండేదాన్ని. కానీ ప్రొడక్షన్ వాళ్లు కావాలనే షూటింగ్ కోసం ఉదయాన్నే పిలిచేవారు. నా మానసిక స్థితి సరిగా లేదని చెప్పినా.. రమ్మని బలవంతం చేసేవారు. ఎదురు ప్రశ్నించలేక షూట్ కోసం వెళ్తే అక్కడ కూడా నన్ను వెయిట్ చేయించేవారు” అని కన్నీరు పెట్టుకుంది.
చాలా తక్కువ కాలంలోనే నా తల్లిని, అమ్మమ్మను కోల్పోయాను. నా జీవితంలో మూలస్తంభాలు అయిన వాళ్లు నాతో లేకపోవటంతో ఆ బాధను భరించలేక నా జీవితం ముగిసిపోయిందని అనుకున్నాను. అంత బాధలోనూ షూటింగ్‌కి వెళ్తే ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ షో వాళ్లు నన్ను ఎంతో హింసించేవారు. నేను తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. అమ్మ వైద్యం కోసం డబ్బులు ఇచ్చామని ఆ షో వాళ్లు ప్రచారం చేసుకున్నారు. అది విని ఇంకా ఎక్కువ బాధపడ్డాను” అని మోనిక చెప్పుకొచ్చింది.
కాగా, గతంలో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ షో నిర్మాతపై మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ బన్సీలాల్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.