నందమూరి బాలకృష్ణ కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మూడు దశాబ్దాల నుంచి అగ్రకథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో యువకథానాయకుల జోరు కొనసాగుతున్నా వారికి దీటుగా బాలయ్య విజయాలను సాధిస్తున్నారు. అయితే ఆయన నటవారసత్వాన్ని కొనసాగించే నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ ఎప్పుడా అని ఆయన అభిమానులతో పాటు, ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై రూమర్లు వచ్చిన అవేవీ నిజం కాలేదు.

ఆ మధ్య నటనలోకి అడుగు పెట్టడానికి మోక్షజ్ఞనే ఆసక్తి చూపించట్లేదని గుసగుసలు వినిపించాయి. అలాంటి అభిప్రాయం కలగడానికి తన లుక్స్ ప్రధాన కారణం. ఒకప్పుడు మోక్షజ్ఞ చాలా లావుగా కనిపించాడు. ఒక దశలో విపరీతంగా బరువు పెరిగిపోయి.. పొట్టతో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. దాంతో చాలా ముందు మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదోమో అనుకున్నారు. అంతెందుకు ఏడాది ముందు కూడా మోక్షజ్ఞ లుక్స్ హీరోకు తగ్గట్లు లేవు. అయితే మళ్లీ గతకొంత కాలంగా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్లే ఏదో సర్జరీ చేయించుకున్నట్లు ఒక్కసారిగా హీరోలా మారిపోయి కనిపించాడు ఈ నందమూరి హీరో.
గతంలో ఈ విషయంపై బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞపై తనకు చాలా ఆశలున్నాయని, తాను దర్శకత్వం వహించే ‘ఆదిత్య-369’ సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పినా, దానిపై తర్వాత ఎటువంటి వార్తలు రాలేదు. అయితే తాజాగా మరోసారి దీనిపై వార్తలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాకు బాలయ్యనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడట. కాగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే బాలయ్య కొడుకు లుక్స్ పై మరింత కేర్ తీసుకున్నాడట. ఈ క్రమంలోనే చాలా స్లిమ్ గా అయి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇంత త్వరగా సన్నమవడానికి తారక్ లానే సర్జరీ చేయించుకున్నాడని అందరూ భావిస్తున్నారు. ఏదేమైనాఈ నందమూరి హీరో లుక్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.