Chiranjeevi : మన టాలీవుడ్ లో లెజెండ్స్ గా పిలవబడే చిరంజీవి , మోహన్ బాబు మధ్య టామ్ & జెర్రీ గొడవలు చాలా సరదాగా ఉంటాయి. వీళ్ళు కావాలని గొడవపడరు, కానీ అలా గొడవపడే పరిస్థితులు చాలానే వచ్చాయి. ఎంత గొడవపడినా కూడా వెంటనే కలిసిపోయేవారు. వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం అలాంటిది మరి. ఇద్దరు దాదాపుగా ఒకేసారి కెరీర్ ని ప్రారంభించారు.
చిరంజీవి హీరో గా నటించిన అత్యధిక సినిమాల్లో మోహన్ బాబు విలన్ గా నటించాడు. పలు సినిమాల్లో ఇద్దరూ కలిసి హీరోలుగా కూడా చేసారు. అయితే మంచి ఎస్టాబ్లిషెడ్ విలన్ గా ఎదిగిన మోహన్ బాబు, ఆ తర్వాత 1990 దశకం లో పూర్తి స్థాయి హీరో గా మారాడు. ఆయన హీరో గా నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసాయి, ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నాయి, అలా మోహన్ బాబు తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయిపోయాడు.
ఇదంతా పక్కన పెడితే కొన్ని కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు కి చిరంజీవి అంటే అసూయ ఉండేది. ఆయన హిట్ మీద హిట్ కొడుతూ ముందుకు దూసుకెళ్తున్నప్పుడు నాకు అలాంటి హిట్స్ ఎందుకు రావు అని బాధపడేవాడు. ఉదాహరణకి చిరంజీవి , కె రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన ‘రౌడీ అల్లుడు’ అనే చిత్రం పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఈ సినిమా సక్సెస్ అయ్యినందుకు రాఘవేంద్ర రావు కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘నువ్వు సూపర్ హిట్స్ అన్నీ చిరంజీవి తోనే చేస్తున్నావ్, నాతో చెయ్యట్లేదు. నాతో కూడా ఒక సినిమా చెయ్యి, లేదంటే నిన్ను చంపేస్తా’ అని సరదాగా మాట్లాడాడట. ఆ తర్వాత కొద్దిరోజులకు మోహన్ బాబు ని హీరో గా పెట్టి, సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ‘మేజర్ చంద్రకాంత్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.